ETV Bharat / state

మాది ప్రజాస్వామ్య పాలన - తిరుగుబాటు ఉండదు : డిప్యూటీ సీఎం భట్టి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 6:05 PM IST

Updated : Jan 7, 2024, 10:58 PM IST

Deputy CM Bhatti Vikramarka Press Meet at Khammam : రాష్ట్ర ప్రజలు, అధికారులు స్వాతంత్య్రం వచ్చినట్లుగా భావిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమది ప్రజాస్వామ్య పాలన అని, తమపై తిరుగుబాటు ఉండదని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి ఈ మేరకు మాట్లాడారు.

Deputy CM Bhatti Vikramarka
Deputy CM Bhatti Vikramarka Press Meet at Khammam

Deputy CM Bhatti Vikramarka Press Meet at Khammam : తమది ప్రజాస్వామ్య పాలన అని, తమపై తిరుగుబాటు ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు పెట్టామన్న కాళేశ్వరం ప్రాజెక్టు అధోగతి పాలైందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. బీఆర్​ఎస్​, బీజేపీలపై విమర్శలు చేశారు.

రాష్ట్ర ప్రజలు, అధికారులు స్వాతంత్య్రం వచ్చినట్లుగా భావిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. ఎవరిపైనా ఒత్తిడిలేని పాలన కొనసాగిస్తామని, ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచీకరణకు అనుగుణంగా వర్సిటీల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడతామన్నారు. నియంతృత్వ పాలకుల మీద మాత్రమే తిరుగుబాటు వస్తుందని తెలిపారు. ఇప్పటికే తిరుగుబాటు వచ్చి నియంతృత్వ పాలన పోయిందని గుర్తు చేశారు.

Bhatti Vikramarka Fires on BRA and BJP : అలాగే లక్ష కోట్లు ఖర్చు పెట్టామన్న కాళేశ్వరం(Kaleshwaram Project) అధోగతి పాలైందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాళేశ్వరం బీఆర్​ఎస్​కు ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలే అన్నారని నాటి మాటలను గుర్తు చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నా, బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. బీఆర్​ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం ఇంకా ఉందని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఫలితం ఉండదని వివరించారు. సోనియాగాంధీ తెలంగాణలో పోటీ చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.

ఈ విధంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కానుక ఇవ్వాలని భావించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి 30 రోజులు అవుతున్న కారణంగా ఎక్స్​లో స్పందించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. శాసనసభ సమావేశాల్లో ఆర్థిక శాఖ, విద్యుత్​ శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేసిన దగ్గర నుంచి వాటికి వివరణ ఇస్తూ ఉన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ, దీటైన జవాబులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతోనూ మంచి సత్సంబంధాలు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నారు.

టార్గెట్​ 2024- 500 స్థానాల్లో కాంగ్రెస్ సర్వే! సీట్ల పంపకం చర్చలకు ముందే!

గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క

Last Updated :Jan 7, 2024, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.