ETV Bharat / state

Srihan Record: రెండున్నరేళ్ల బుడతడు.. "ఇండియా బుక్‌ఆఫ్ రికార్డ్స్"లో చోటు

author img

By

Published : Jun 19, 2022, 5:44 PM IST

Srihan Record: రెండేళ్ల వయసులో పిల్లలు ఎవరైనా"అమ్మా, నాన్న, మామ, తాతా" అంటూ మాట్లాడుతుంటే పెద్దలు మురిసిపోతుంటారు. అదే రెండేళ్లకు శ్లోకాలు ధారాళంగా చెప్పడమంటే. ఆ వయసులోనే ఆంగ్ల పదాలను మరో భాషలోకి అనువదించటమంటే.. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను చూసి గుక్క తిప్పుకోకుండా వారిపేర్లు చెప్పడమంటే సాధారణ విషయం కాదు. మరెన్నో విషయాలను అనర్గళంగా వివరిస్తూ పసిప్రాయంలోనే "ఇండియాబుక్‌ ఆఫ్‌ రికార్డ్‌"లో పేరు నమోదుచేసుకొని ఔరా అనిపిస్తున్నాడు కరీంనగర్‌కు చెందిన చిన్నారి.

Srihan Record
కరీంనగర్‌కు చెందిన చిన్నారి శ్రీహాన్

Srihan Record: చూస్తున్నారుగా..... పిట్ట కొంచెం కూత ఘనం ఇదేనేమో. రెండున్నరేళ్లున్న ఈ బుడతడి వయసుకు... చెప్పే మాటలకు ఏ మాత్రం సంబంధమే లేదనిపిస్తుంది కదూ. ఏబీసీడీలు దిద్దే వయసైనా రాకపోయినా చిట్టిమెద‌డుతో ఆశ్చర్యానికి గురిచేస్తూ "ఇండియా బుక్‌ఆఫ్ రికార్డ్స్"లోనూ చోటుసాధించాడు.కరీంనగర్‌కు చెందిన "శ్రావణి-సుమన్‌కుమార్‌"ల కుమారుడు శ్రీహాన్‌ 2019 నవంబర్‌ 6న జన్మించాడు. చిన్నతనం నుంచే ముద్దుముద్దు మాటలతో అబ్బురపర్చటాన్ని తన తాతయ్య, విశ్రాంత తహసీల్దార్‌ శంకరయ్య గమనించాడు. అలా శ్రీహాన్‌పై ప్రత్యేక దృష్టి సారించిన తల్లిదండ్రులు... ప్రతి విషయాన్ని అర్థమయ్యేలా వివరిస్తూ ఉండేవారు. అమ్మానాన్నలు చెప్పిన ప్రతి మాటను ఎంతో శ్రద్ధగా అర్థం చేసుకున్న శ్రీహాన్ వారు ఊహించిన దానికి భిన్నంగా అన్నింటిని గుర్తుంచుకుని మరీ... తిరిగి చెబుతూ ఉండేవాడు.

నేను బాబును గమనించాను. చాలా మెమొరి పవర్ ఉంది. నేర్చుకోగలుతాడని గ్రహించా. పిల్లలను మనం ఎంత ప్రోత్సహిస్తే అంత మంచిది. సరైన పద్ధతిలో మనం శిక్షణ ఇస్తే చాలా మెరుగవుతారు. ఏ రంగంలోనైనా వారు రాణించగలరు.

- శంకరయ్య, శ్రీహాన్‌ తాతయ్య

రెండున్నరేళ్ల బుడతడు.. "ఇండియా బుక్‌ఆఫ్ రికార్డ్స్"లో చోటు

తల్లిదండ్రులు చెప్పినట్లుగా తొలుత ఆంగ్లపదాలను హిందీలోకి అనువదించిన శ్రీహాన్.. అనంతరం, పలు వైద్యపరికరాలు గుర్తించడం రంగులు, వాహనాల పేర్లు చెప్పడం, ఎలక్ట్రానిక్ పరికరాల గురించి వివరించటం జరుగుతుంది. చిత్రపటాల్లోని దేవతలు, స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తించటం, గృహోపకరణాలు, పండ్లు, కూరగాయలు, మానవ శరీరఅవయవాలు, దేశాల జాతీయ పతాకాలు, రాష్ట్రాల రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను అనర్గళంగా వివరిస్తున్నాడు. వాటితో పాటు తల్లిదండ్రులు నేర్పించిన గాయత్రి మంత్రం 4 శ్లోకాలను శ్రీహాన్‌ ధారాళంగా చెప్పి అబ్బురపరుస్తున్నాడు.

మా బాబుకు ఏడాదిన్నరకే మాటలు రావడం, సెంటెన్సెస్ ఫార్మ్ చేయడం చేశారు. మా నాన్న గుర్తించి మాకు చెప్పారు. మా అత్త సలహాతో శ్లోకాలు నేర్పించాం. బాబుకు ఇప్పుడు రెండున్నరేళ్లు. మేము ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్​లో ఎన్​రోల్ చేశాం. హిందీలో ట్రాన్స్​లేషన్ నేర్పించాం. బలవంతంగా నేర్పించడం కంటే సరదాగా చెబుతూ నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారు.

- కాసం శ్రావణి, శ్రీహాన్‌ తల్లి

శ్రీహాన్‌ అసాధారణ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేయించారు. అతి పిన్నవయస్సులో అరుదైన గుర్తింపు రావటంపై కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఏదైనా విషయాన్ని బలవంతంగా నేర్పించటం కంటే సరదాగా ఆడిస్తూ, పాడిస్తూ వివరిస్తే వారిని సూపర్‌ కిడ్స్‌గా తీర్చిదిద్దవచ్చునని శ్రీహాన్‌ తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

'బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు'
ముస్లిం పెళ్లిలో 'బుల్డోజర్ బరాత్'.. అంతా యోగి మహిమ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.