ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్

author img

By

Published : Feb 20, 2021, 11:59 AM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన కుటుంబానికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేందర్ అందించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన సిరిగిరి సురేశ్, స్వరూప దంపతులకు రూ.4లక్షలు విలువ చేసే చెక్​ను అందజేశారు.

telangana health minister etela rajender has given cm relief fund cheque to road accident victims
రోడ్డు ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​ పట్టణంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన సిరిగిరి సురేశ్, స్వరూప కుటుంబానికి రూ. 4 లక్షలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు.

సురేశ్, స్వరూప తమ కుటుంబ సభ్యులతో కలిసి గతేడాది నవంబర్​లో ఆటోలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చికిత్స కోసం లక్షల్లో ఖర్చయిందని, తమను ఆదుకోవాలని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు.

బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన రూ.4 లక్షల విలువ గల చెక్కును మంత్రి ఈటల అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్​పర్సన్ గందె రాధిక, వైస్ ఛైర్​పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు మొలుగు సృజన, పైళ్ల వెంకట్ రెడ్డి, తోట రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.