ETV Bharat / state

కరీంనగర్ జిల్లాలో 36 ధరణి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు షురూ

author img

By

Published : Nov 2, 2020, 5:41 PM IST

కరీంనగర్ జిల్లాలో ధరణి సేవలను జిల్లా కలెక్టర్ కె.శశాంక ప్రారంభించారు. అనంతరం కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. తొలిరోజు 36 ధరణి కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు.

Registrations start at 36 Dharani centers in Karimnagar district
కరీంనగర్ జిల్లాలో 36 ధరణి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు షురూ

కరీంనగర్ రూరల్ మండల కార్యాలయాల్లో ధరణి సేవలను జిల్లా కలెక్టర్ కె.శశాంక ప్రారంభించారు. అనంతరం కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. పోర్టల్​లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకున్న ప్రజలకు అదే రోజున రిజిస్ట్రేషన్, మోటేషన్, ఆన్​లైన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఈ కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ద్వారా మహమ్మద్ జహేద బేగం నుంచి తాడి ఎల్లయ్య కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆయన తెలిపారు.

కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో దయాల రవళి కొనుగోలు చేసిన భూమిని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామని అన్నారు. అరగంటలో పని పూర్తి చేసి పంపించే ప్రక్రియ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలకు చాలా సులభంగా అధికారులతో గానీ.. మధ్య దళారులతో గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకొనే సౌకర్యం కలిగిందని ఆయన పేర్కొన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జిల్లాలో మొత్తం 49 ధరణి కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తొలిరోజు 36 ధరణి కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు.

ఇవీ చూడండి... 'సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.