ETV Bharat / state

KTR Attended BRS Activists Meeting at Bikkanur : ఈ ఎన్నికల్లో దిల్లీ దొరలకు గల్లీ ప్రజలకు మధ్య పోరాటం అందుకే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 3:27 PM IST

KTR Attended BRS Activists Meeting at Bikkanur : తెలంగాణ పౌరుషానికి ప్రతీకైన కేసీఆర్​ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్ కామారెడ్డి ప్రజలను కోరారు. జిల్లాలోని బిక్కనూర్​లో జరిగిన బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్​.. అనంతరం నేతలకు దిశానిర్దేశం చేశారు.

Minister KTR
Minister KTR Attended BRS Activists Meeting at Bikkanur

KTR Attended BRS Activists Meeting at Bikkanur : ఈ ఎన్నికల్లో దిల్లీ దొరలకు.. గల్లీ ప్రజలకు మధ్య పోరాటం జరుగుతోందని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR)​ అన్నారు. తెలంగాణ పౌరుషానికి ప్రతీకైన కేసీఆర్​ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కామారెడ్డి ప్రజలను కోరారు. జిల్లాలోని బిక్కనూర్​లో జరిగిన బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్​.. అనంతరం నేతలకు దిశానిర్దేశం చేశారు.

రైతులను బిచ్చగాళ్లని అవమానించిన కాంగ్రెస్​ డిపాజిట్లు గల్లంతు చేయాలని మంత్రి కేటీఆర్​.. కామారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రేవంత్​ రెడ్డి మూడు గంటలు విద్యుత్​ సరఫరా చాలంటారని.. ఉత్తమ్​కుమార్​ రెడ్డి రైతు బంధు దుబారా అంటారన్నారు. ఈ 24 గంటల విద్యుత్​ సరఫరా, రైతు బంధు వద్దనే వాళ్లు తమకు కావాలా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ మట్టిబిడ్డ కేసీఆర్​ ఉండగా.. రాహుల్​, డీకే శివకుమార్​ తమకెందుకంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హనుమంతుడి గుడిలేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని తెలిపారు.

Minister KTR Participate in BRS Booth Level Meeting : 'ఈ 30 రోజులు సెల్ఫీ కొట్టు.. ఓటు పట్టుతో సోషల్​ మీడియాలో దుమ్ము లేవాలి'

KTR on BRS Manifesto : కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్​ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కేసీఆర్​ బీమా(KCR Bhima).. ప్రతి ఇంటికీ ధీమా పథకం అందిస్తామని మాటిచ్చారు. అన్నపూర్ణ పథకం ద్వారా అందరికీ సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డిని అభివృద్ధి చేసేందుకే కేసీఆర్​ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. అందుకే నవంబరు 9న కేసీఆర్​ నామినేషన్​ వేస్తారని.. ఆరోజు అందరూ రావాలని పిలుపునిచ్చారు.

KTR Fires on Congress : రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు కామారెడ్డి నియోజకవర్గం గురించే చర్చ జరుగుతోందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. కేసీఆర్​ ఎందుకు అక్కడి నుంచే పోటీ చేస్తున్నారని జోరుగా చర్చలు సాగుతున్నాయని చెప్పారు. కామారెడ్డి రైతుల కల నెరవేర్చడానికే కేసీఆర్​ పోటీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బీఆర్​ఎస్​ ఇచ్చే బిర్యానీ తినండి అంటూ చమత్కరించారు. ఇతర పార్టీలు డబ్బులిస్తే తీసుకొండి.. కానీ ఓటు మాత్రం గులాబీ పార్టీకే వేయాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్​ తెలంగాణ ఇచ్చిందన్నారు. సోనియాని బలిదేవత, రాహుల్​ను ముద్ద పప్పు అని రేవంత్​ రెడ్డి అన్నారని.. నాటి మాటలను గుర్తు చేశారు. రాహుల్​ చెప్పినట్లు ఇది దిల్లీ దొరలకు, గల్లీ ప్రజలకు మధ్య పోరాటం అని అన్నారు.

BRS campaign in Telangana 2023 : ప్రచారంలో కారు జోరు.. కేసీఆర్ భరోసాతో ప్రజల్లోకి బీఆర్ఎస్ నేతలు.. పలుచోట్ల నిరసన గళమెత్తుతున్న ప్రజలు

KTR Comments on Revanth Reddy : "కొడంగల్‌లో నరేందర్​రెడ్డిపై గెలవని రేవంత్‌రెడ్డి... కేసీఆర్​పై గెలుస్తారా..?"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.