ETV Bharat / state

HUZURABAD BYPOLL: హుజూరాబాద్​కు మెడికల్​ కాలేజీ తీసుకొస్తా.: గెల్లు శ్రీనివాస్​

author img

By

Published : Oct 12, 2021, 4:08 PM IST

హుజూరాబాద్​కు (HUZURABAD BYPOLL) మెడికల్​ కాలేజీ తీసుకువస్తానని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​ (HUZURABAD TRS CANDIDATE) హామీ ఇచ్చారు. పేదలకు ఐదు వేల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సొంత జాగాలున్న వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

huzurabad trs candidate
huzurabad trs candidate

హుజూరాబాద్​ ఉపఎన్నికలకు తెరాస విస్తృత ప్రచారం (HUZURABAD BYPOLL) చేస్తోంది. ఒకవైపు నుంచి మంత్రులు, మరోపక్క ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ యాదవ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి (huzurabad by election campaign) వెళ్తున్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు.

'ఈటలకు చిత్తశుద్ధి లేదు..'

ఇప్పల నర్సింగాపూర్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారం చేశారు. ఎప్పటి నుంచో తెరాసకు హుజూరాబాద్​ నియోజకవర్గం అండగా ఉందని గెల్లు శ్రీనివాస్​ తెలిపారు. అందువల్లనే ఐదేళ్ల క్రితం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ నాలుగు వేల డబుల్​ బెడ్​రూం ఇళ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఒక్క ఇల్లైనా నిర్మించి ఈటల రాజేందర్​ పేదలకు అందించారా.. అని గెల్లు శ్రీనివాస్​ ప్రశ్నించారు. ఆయనతో పాటు పనిచేసిన మంత్రులు హరీశ్​రావు, శ్రీనివాస్​గౌడ్​, స్పీకర్​ పోచారం తమతమ నియోజకవర్గాల్లో 4 నుంచి 5 వేల ఇళ్లు నిర్మించి ఇచ్చారని గెల్లు శ్రీనివాస్​ తెలిపారు. దీని బట్టే ఈటలకు పేదలకు సేవచేయాలనే చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందని.. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ విమర్శించారు.

హుజూరాబాద్​కు మెడికల్​ కాలేజీ..

పేదలకు సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారన్న గెల్లు.. సీఎం కేసీఆర్​తో మాట్లాడి హుజూరాబాద్​లో మెడికల్​ కాలేజీ ఏర్పాటుచేయాలని కోరాతానని హామీ ఇచ్చారు. ఫలితంగా నియోజకవర్గంలోని పేదలకు లక్షల వ్యయమయ్యే చికిత్సలను ఉచితంగా చేస్తామని వెల్లడించారు.

ఐదు వేల ఇళ్లు..

పేదలకు ఐదు వేల ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని.. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని (HUZURABAD TRS CANDIDATE) తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​యాదవ్​ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సొంత జాగాలుంటే రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఉద్యమ సమయంలో హైదరాబాద్​లో 12 పోలీస్​ స్టేషన్ల పరిధిలో తనపై సుమారు 130 కేసులున్నాయని గెల్లు శ్రీనివాస్​ (HUZURABAD TRS CANDIDATE) చెప్పారు. 20 ఏళ్లగా ఉద్యమం కోసం పనిచేశాననే ఉద్దేశంతోనే తనకు సీఎం కేసీఆర్​ అవకాశం ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే తెరాసకు ఓటేయాలని కోరారు. ఇప్పటికే నియోజకవర్గంలోని సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పిన గెల్లు శ్రీనివాస్​.. అలాంటి ప్రభుత్వానికి అందరి మద్దతు అవసరమన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే తనను గెలిపించాలని తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​ ఓటర్లను కోరారు.

HUZURABAD BYPOLL: హుజూరాబాద్​కు మెడికల్​ కాలేజీ తీసుకొస్తా.: గెల్లు శ్రీనివాస్​

'ఈటలకు ఆరుసార్లు అవకాశం ఇచ్చారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. హుజూరాబాద్​ నియోజకవర్గానికి ఎన్ని నిధులైనా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. పేదలకు 5 వేలు ఇళ్లు నిర్మించి ఇస్తాం. సొంత స్థలాలు ఉన్న వారికి ఐదు లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్​ను కోరుతాం. పేదలకు మెరుగైన చికిత్స కోసం హుజూరాబాద్​లో మెడికల్​ కాలేజీ ఏర్పాటుచేసేలా సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేస్తా.'

- గెల్లు శ్రీనివాస్‌, తెరాస అభ్యర్థి

ఇదీచూడండి: huzurabad by election: తెరాస మంత్రుల పద్మవ్యూహంలో చిక్కని ఈటల..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.