ETV Bharat / state

huzurabad by election: తెరాస మంత్రుల పద్మవ్యూహంలో చిక్కని ఈటల..!

author img

By

Published : Oct 12, 2021, 4:57 AM IST

హుజూరాబాద్ ఉపఎన్నికల (huzurabad by election) ప్రచారం రసవత్తంగా సాగుతోంది. ఈఎన్నిక.. మంత్రి హరీశ్​రావు, భాజపా అభ్యర్థి ఈటల మధ్య అన్నట్లు సాగుతోంది. దీనికి ప్రధాన పార్టీలు వినూత్నంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ... ప్రత్యర్థిని ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈటల మాత్రం మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

etela
etela

హుజూరాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా (huzurabad by election)... అధికార తెరాస, భాజపా మధ్య ప్రచార పోరు రసవత్తరంగా జరుగుతోంది (by election election canvasing). ప్రత్యర్థిని చిత్తుచేసేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.

అధికార తెరాస వ్యూహమిది..

ఈటలను (etela rajender) మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన తరువాత నుంచి ఇప్పటివరకు తెరాస ప్రచారం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. మంత్రులు హరీశ్​ రావు (harish rao), గంగుల కమలాకర్(gangula kamalakar), కొప్పుల ఈశ్వర్‌(koppula eswar) హుజూరాబాద్ (huzurabad) కేంద్రంగానే సమీకరణలు జరుపుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్‌, సుంకె రవిశంకర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలోనే ఉంటున్నారు. వీరు కాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా హుజూరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి మంత్రులు తన్నీరు, గంగుల, కొప్పుల... పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యత తమదేనన్నట్లు పని చేస్తున్నారు.

సామాజిక వర్గాల సమీకరణ...

తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్(gellu Srinivas ) గెలుపే లక్ష్యంగా సామాజిక వర్గాల వారీగా సమీకరణాలు జరుపుతూనే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచార సభలు, ఓటు బ్యాంకు ఉన్న వారిని తెరాసకు అనుకూలంగా మార్చుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ అంశాన్ని వదలకుండా పావులు కదుపుతున్నారు. 2004 నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పనిచేసిన ఈటల కోటలో పాగా వేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈటల రాజేందర్‌ను ఒంటరిని చేయడమే లక్ష్యంగా... ద్వితీయ శ్రేణి నాయకులను ఆయనకు దూరం చేయడంలో సఫలం అయ్యారు. ఇంతకు ముందు ఈటల అనుయాయులుగా ఉన్నవారందరిని భౌతికంగా తమవైపు తిప్పుకోవడంలో అధికార తెరాస విజయం సాధించినట్లు ప్రచారం జరుగుతుండగా... మానసికంగా ఏమేర పనిచేస్తున్న అంశంపై ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.

మొక్కవోని గాంభీర్యంతో...

రాష్ట్రంలో అధికార తెరాస(trs party) పార్టీని ఎదిరించి ఉప ఎన్నికల బరిలో నిలిచిన ఈటల రాజేందర్... నియోజకవర్గంలో అన్నీ తానై ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓ వైపున ఈటల, మరో వైపున ఆయన సతీమణి జమున (etela jamuna) ప్రచారంలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో తిరుగుతూ తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత అయితే ఈటల దంపతులు కార్యక్షేత్రంలోనే తిరుగుతూ తమ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అండగా నిలుస్తారనుకున్న అనుయాయులు అంతా కూడా తనను వీడినా.. ఈటల రాజేందర్ మాత్రం వెనుకంజ వేయడం లేదు. పక్కా ప్రణాళికతో రాజేందర్ ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ప్రచారం చేయగా ఆయన భార్య జమున కొన్ని గ్రామాలు తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

పద్మవ్యూహంలో చిక్కని ఈటల

తెరాస పద్మవ్యూహంలో చిక్కుకోకుండా ఈటల తన పంథాతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యర్థి పార్టీ తనను ఒంటరి చేయడంలో సఫలం అయినా ఆయన మాత్రం గుండె నిబ్బరంతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు... తనవాళ్లు అనుకొని పదవులు ఇప్పించుకున్న వారు కూడా ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. ఎవరు దూరమైనా... ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఈటల రాజేందర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పవచ్చు. ఈటల చుట్టూ ఉన్న నాయకులందరినీ వెనక్కి రప్పించుకుంటే ఆయన మానసికంగా దెబ్బతింటారని భావించినప్పటికీ ఆయన ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. దీంతో తెరాస నాయకుల ఎత్తుగడలను ఈటల చిత్తు చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పకతప్పదనే అభిప్రాయం నెలకొంది.

ఇదీ చూడండి: Huzurabad: వాడివేడిగా ఉపఎన్నిక ప్రచారం.. కొనసాగుతున్న విమర్శల పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.