ETV Bharat / state

huzurabad by election: కాదేదీ ప్రచారానికి అనర్హం.. పెట్రోల్​, డీజిల్​, వంటగ్యాస్​ ధరలే ప్రధాన అస్త్రాలుగా

author img

By

Published : Oct 15, 2021, 5:14 AM IST

huzurabad by election
huzurabad by election

హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా (huzurabad by election) జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది (huzurabad by election campaign). ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలతో పాటు జాతీయ అంశాలపై రసవత్తర చర్చలు, సవాళ్లు ప్రతిసవాళ్లు సాగుతున్నాయి. ప్రధానంగా ప్రజలపై ప్రత్యక్షంగా భారం మోపే అంశాలపై... లోతుగా తీసుకెళ్లేందుకు యత్నిస్తుంటే వాటిని ఖండించి ఆ విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రత్యర్థులు యత్నిస్తున్నారు.

హుజూరాబాద్​ ఉప ఎన్నిక (huzurabad by election) ప్రచారం సందర్భంగా (huzurabad by election campaign) ప్రతి మీటింగ్‌లోను గ్యాస్ సిలిండర్ మంటలు చెలరేగుతున్నాయి. ధరల ప్రభావం పార్టీపై ఎక్కడ పడుతుందోనని భాజపా, తెరాస ఢీ అంటే ఢీ అంటున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలపై ఈటల రాజేందర్, మంత్రి హరీశ్​ సవాళ్లు విసురుకుంటున్నారు.

రాష్ట్రంలో ప్రతిరోజు పెట్రోల్‌, డీజిల్​తో పాటు గ్యాస్​ ధరలు పెరగుతుండడం.. హూజురాబాద్​ ఉప ఎన్నికలో చర్చనీయ అంశంగా మారింది (huzurabad by election campaign). దీనికి తోడు బతుకమ్మ పండగ కావడంతో ప్రచారానికి వంటగ్యాస్​ ధరలను అస్త్రాలుగా ఎంచుకుంటున్నారు (huzurabad by election campaign). కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలెండర్ ధర రూ.15 పెంచింది. పండగ పూట సిలిండర్ ధర పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని... రోజురోజుకు ధరలు పెంచుతున్న భాజపాకు ఓటు వేయొద్దని తెరాస ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుంటోంది.

ప్రజలపై ప్రేమ ఉంటే పన్ను రద్దు చేయండి

ఈ విమర్శలపై భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్​పై రాష్ట్ర ప్రభుత్వం రూ. 291 పన్ను వేస్తోందని, తెరాస పార్టీనే పేదల నడ్డి విరుస్తోందని ప్రతివిమర్శ చేస్తున్నారు. ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ పన్ను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.

సవాళ్లు ప్రతిసవాళ్లు

గ్యాస్ సిలిండర్​పై రాష్ట్రం రూ.291 పన్ను విధిస్తోందని ఈటల, పెట్రోల్‌కు వసూలు చేసే రూ.100లో రూ. 30 కేసీఆర్​కు పోతాయంటూ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విస్తృత ప్రచారం చేశారు (huzurabad by election campaign). భాజపా కామెంట్స్‌పై మంత్రి హరీశ్​ రావు కౌంటర్ వేశారు. సిలిండర్​పై రాష్ట్రం రూ.291 పన్ను వేస్తున్నట్లు నిరూపిస్తే... ముక్కు నేలకు రాస్తా... లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటారా అని ఈటలకు సవాల్ విసిరారు. రాష్ట్రం విధించే పన్నులు కూడా కేంద్రమే విధిస్తోందని... అవన్నీ జీఎస్టీ పరిధిలోకి వస్తున్నాయని కౌంటర్ ఇచ్చారు.

బతుకమ్మ వేడుకలోను ప్రచారం
బతుకమ్మ వేడుకలోను ప్రచారం

భాజపా నేతలు ఇళ్లకు రావొద్దంటూ

హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా వంట గ్యాస్ ధరలపై నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. కొందరి ఇళ్లపై సిలిండర్ ధరలు పెంచిన భాజపా నేతలు తమ ఇంటికి రావొద్దని బోర్డులు పెట్టిస్తున్నారు. బతుకమ్మలకు బదులు సిలిండర్ల బెలూన్లతో ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు.

ఇదీ చూడండి: huzurabad by election: విమర్శలే ప్రధాన అస్త్రాలు.. కానరాని భవిష్యత్‌ ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.