Huzurabad Hospital:పేదలకు వరంగా ఏరియా ఆస్పత్రి.. అధునాతన సౌకర్యాలతో వైద్యసేవలు

author img

By

Published : Jul 2, 2022, 5:29 PM IST

Huzurabad Hospital

Huzurabad Hospital: సర్కారు దవాఖానా అంటే సగం మందికి గుబులు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే కొంత జంకుతుంటారు. కానీ, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం రోగులు వరుస కడుతున్నారు. ఇక్కడ కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలందిస్తుండటంతో పాటు లక్షల ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారు. అయితే మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు పరికరాలు మంజూరైనా...కాగితాలకే పరిమతం అయ్యింది.

Huzurabad Hospital హుజురాబాద్‌ ఏరియా ఆస్పత్రి పేదలకు వరంగా మారింది. గైనకాలజీ, ఆర్థో, పిల్లలు, అత్యవసర విభాగాలను ఏర్పాటు చేసి అధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. నెలకు సుమారు 200 వరకు ప్రసూతి సేవలు, 50 నుంచి 70 జనరల్‌ సర్జరీలు, 20 నుంచి 30ఆర్థోపెడిక్‌ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఉన్నవసతులను సద్వినియోగం చేసుకుంటూ చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.

ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఇటీవల వైద్య విధాన పరిషత్‌ పరిధిలోకి చేర్చి సేవలు మరింత విస్తృతం చేశారు. ఆస్పత్రిలో సీనియర్‌ సివిల్‌ సర్జన్లు, సివిల్‌ సర్జన్లు, స్త్రీ వైద్య నిపుణులు, మత్తుమందు వైద్యులు, పిల్లల నిపుణులు, కీళ్లు, ఎముకల డాక్టర్లు, చెవి, ముక్కు గొంతు వైద్యులు, రేడియాలజీ నిపుణురాలు అందుబాటులో ఉన్నారు. ఈ విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఆధునిక ల్యాబ్‌ల ద్వారా రోగులకు అవసరమైన రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఖరీదైన యంత్రాలను తీసుకువచ్చి 24గంటల పాటు సేవలు కొనసాగిస్తున్నారు.

పేదలకు వరంగా ఏరియా ఆస్పత్రి.. అధునాతన సౌకర్యాలతో వైద్యసేవలు

ఆస్పత్రికి హుజురాబాద్‌ నుంచే కాకుండా భూపాలపల్లి, ములుగు, కరీంనగర్‌, హన్మకొండ, సిద్దిపేట, వరంగల్‌, పెద్దపల్లితో పాటు వివిధ జిల్లాల నుంచి రోగులు శస్త్రచికిత్సల కోసం వస్తున్నారు. వేలాది రూపాయల ఖర్చుతో కూడిన ఆపరేషన్లను ఉచితంగా చేస్తున్నారు. రోగులకు మరింత అధునాతన సేవల కోసం ఆధునిక పరికరాలు మంజూరు చేస్తూ వైద్య విధాన పరిషత్‌ గతేడాది మార్చిలో ఆసుపత్రికి లేఖ పంపారు. సుమారు 80లక్షల విలువ గల పరికరాలను అందించేందుకు సుముఖత తెలిపారు. లాప్రోస్కోపి, జీఎస్​టీ యంత్రంతో పాటు ఇతర పరికరాలను కేటాయించారు. అయితే ఇదీ అందని ద్రాక్షగానే మారింది. ఏడాది గడిచినా పరికరాలు ఇంకా ఆసుపత్రికి చేరుకోలేదు. ఇతర సిబ్బంది సంఖ్య కొంత తక్కువగా ఉన్నా అంకితభావంతో సేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.


ఇవీ చదవండి:

'సమస్యలపై చర్చించకుండా ప్లెక్సీలతో చిల్లర రాజకీయం చేస్తున్నారు..'

అపార్ట్​మెంట్​లో పైథాన్​ కలకలం.. రెండో అంతస్తులోని బాల్కనీలోకి వెళ్లి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.