ETV Bharat / state

Etela Rajender at Sriramula Pally: కేసీఆర్​ కత్తి అందిస్తే.. హరీశ్​ వచ్చి పొడుస్తుండు: ఈటల

author img

By

Published : Oct 10, 2021, 3:44 PM IST

Updated : Oct 10, 2021, 4:05 PM IST

హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్(Etela Rajender at Sriramula Pally)​..​ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారాల్లో సీఎం కేసీఆర్​, తెరాస పాలనపై భాజపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కరీంనగర్​ జిల్లా శ్రీరాములపల్లిలో ఈటల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్​, హరీశ్​ రావు పచ్చి అబద్ధాల కోరులని ఈటల ఎద్దేవా చేశారు.

Etela Rajender at Sriramula Pally
ఈటల రాజేందర్​ ప్రచారం

ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ పులకించేందని.. ఆయన అడుగులో అడుగేసేదని భాజపా నేత, హుజూరాబాద్​ అభ్యర్థి(Etela Rajender at Sriramula Pally) ఈటల రాజేందర్​ అన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్​ను తిడితే ప్రజలు చప్పట్లు కొడుతున్నారని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఆయన పాలనపై ప్రజలు ఎంత విరక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కమలాపుర్​ మండలం, శ్రీరాములపల్లిలో(Etela Rajender at Sriramula Pally) ఈటల ప్రచారం నిర్వహించారు. ఆయన గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్​తో పాటు తెరాస అభ్యర్థి తరఫున హుజూరాబాద్​ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలపై ఈటల నిప్పులు చెరిగారు.

కేసీఆర్​ కత్తి అందిస్తే.. హరీశ్​ వచ్చి పొడుస్తుండు: ఈటల

తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని మంత్రి హరీశ్​ అడుగుతున్నారని.. తన నియోజకవర్గ ప్రజలకోసం హరీశ్​ రావు ఏం చేశారని ఈటల(Etela Rajender at Sriramula Pally) ప్రశ్నించారు. కళ్లు ఉండి కూడా చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మామాఅల్లుడు అబద్ధాల కోరులని కేసీఆర్​, హరీశ్​ను ఉద్దేశించి ఆరోపించారు. హుజూరాబాద్​లో ఎగిరేది కాషాయ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు.

ప్రశ్నిస్తే బయటకు పంపించారు

కేసీఆర్ ప్రగతి భవన్​లో ఉండి కత్తి అందిస్తే హరీశ్​ రావు వచ్చి పొడుస్తుండు. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి మోసం చేస్తే ఆ ప్రాంతంలోనే పాతి పెట్టాలి. అణిగిమణిగి ఉంటే కేసీఆర్ పొగుడుతరు. ప్రశ్నిస్తే బయటకు పంపిస్తరని నా విషయంలో రుజువైంది. వచ్చే ఎన్నికల్లో తెరాస ఓటమి ఖాయం. 18 ఏళ్లుగా కడుపులో పెట్టుకున్నరు. మళ్లీ నన్ను ఆశీర్వదించండి. మీ రుణం తీర్చుకుంట. తెరాస వాళ్లు ఇచ్చేవి అన్నీ తీసుకోండి. దానికి కారణమైన నన్ను ఆశీర్వదించండి. -ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి

ఇదీ చదవండి: Petrol Diesel Hike: పండుగ వేళ సామాన్యుడిపై ధరల పోటు

Last Updated :Oct 10, 2021, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.