ETV Bharat / state

'ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న పండుగ కానుక బతుకమ్మ చీర'

author img

By

Published : Oct 13, 2020, 11:49 PM IST

bathukamma sarees distribution by mayor suneel rao in karimnagar
'ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న పండుగ కానుక బతుకమ్మ చీర'

ప్రభుత్వం మహిళలను ఆడబిడ్డలుగా భావించి పండుగకు చీరలను పంపిణీ చేస్తుందని కరీంనగర్​ మేయర్​ సునీల్​రావు తెలిపారు. గత ఐదురోజులుగా కరీంనగర్​లో వార్డుల వారీగా బతుకమ్మ చీరలను అందచేస్తున్నారు.

బతుకమ్మ చీరలను ఆడపడుచులు ఉత్సాహంగా తీసుకెళ్తున్నారని కరీంనగర్​లో మేయర్ సునీల్​రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్​లో ఆయన పర్యటించారు. కార్పొరేటర్ లెక్కల స్వప్నవేణుతో కలిసి మేయర్ సునీల్​రావు బతుకమ్మ చీరలను వితరణ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆడబిడ్డలుగా భావించి ఏరాష్ట్రంలో లేని విధంగా సంప్రదాయ పండుగైన బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​కి తెలంగాణ ఆడపడుచుల దీవెనలు నిండుగా ఉండి... ఆయురాగ్యోగంగా ఉండాలని కోరారు. రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించాలన్నారు.

ఇదీ చూడండి: 'పేదింటి ఆడబిడ్డకు పుట్టింటి కానుకగా బతుకమ్మ చీరలు'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.