ETV Bharat / state

మంత్రి ఈటల కాన్వాయ్​ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

author img

By

Published : Apr 16, 2021, 1:35 PM IST

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్​లో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్​ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వ్యవసాయ మార్కెట్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

minister etela, telangana health minister, minister etela rajender
మంత్రి ఈటల, ఆరోగ్య మంత్రి ఈటల, ఈటల రాజేందర్, హుజూరాబాద్​లో మంత్రి ఈటల

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. హుజూరాబాద్​లోని వ్యవసాయ మార్కెట్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. మంత్రి కాన్వాయ్​ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్​ను వెంటనే విడుదల చేయాలని కోరారు.

మంత్రి ఈటల కాన్వాయ్ అడ్డగింత

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడం వల్ల తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.