ETV Bharat / state

ట్రాన్స్​ఫార్మర్​ కోసం.. సబ్​స్టేషన్​ ముందు రైతుల ఆందోళన!

author img

By

Published : Sep 5, 2020, 6:06 PM IST

Formers Protest At Sub Station For Transformer In Kamareddy District
ట్రాన్స్​ఫార్మర్​ కోసం.. సబ్​స్టేషన్​ ముందు రైతుల ఆందోళన!

గ్రామంలో పవర్​ ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేయాలని విద్యుత్​ సబ్​స్టేషన్​ ముందు 100 మంది రైతులు ఆందోళన చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్​ మండలంలో చోటు చేసుకుంది. గ్రామంలో ట్రాన్స్​ఫార్మర్​ కోసం ఎన్నిసార్లు లైన్​మెన్​కు విన్నవించుకున్నా.. అధికారులు స్పందించలేదని.. అందుకే ఆందోళనకు దిగినట్టు రైతులు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్​ మండలం ఉప్పరపల్లి గ్రామంలోని విద్యుత్​ సబ్​ స్టేషన్​ ముందు గ్రామానికి చెందిన 100మంది రైతులు ట్రాన్స్​ఫార్మర్​ కోసం ఆందోళనకు దిగారు. గ్రామంలో పవర్​ ట్రాన్స్​ఫార్మర్​ కంట్రోలర్​ ఏర్పాటు చేయాలని లైన్​మెన్​కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల క్రితం గ్రామంలోని పవర్​ ట్రాన్స్​ఫార్మర్​ చెడిపోయినా.. లైన్​మెన్​, విద్యుత్​ అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోయారు.

ట్రాన్స్​ఫార్మర్​ చెడిపోవడం వల్ల పంటలకు నీరు పెట్టడం ఇబ్బందిగా మారిందని రైతులు అడిగితేే.. బీబీపేట్​ నుంచి వచ్చే విద్యుత్​ లైన్​ని ఉప్పరపల్లి గ్రామానికి కలిపారు. కాగా.. గ్రామంలో మొత్తం 11 ట్రాన్స్​ఫార్మర్​లు ఉండగా.. వాటికి 200 బోరుబావులు నడుస్తున్నాయి. ట్రాన్స్​ఫార్మర్ల మీద లోడ్​ ఎక్కువ కావడం వల్ల, విద్యుత్​​ సరిపోక.. నిత్యం మోటార్లు కాలిపోతున్నాయని రైతులు మొర పెట్టుకుంటున్నారు. గ్రామానికి ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేసేంత వరకు అక్కడి నుంచి కదలమని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పగా.. ఆందోళన విరమించారు. అనంతరం రైతులు ఏఈకి వినతి పత్రం సమర్పించారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.