ETV Bharat / state

చనిపోయిన వ్యక్తి పేరిట ఆధార్‌ సృష్టించి.. మరొకరికి భూమిని అమ్మిన కేటుగాళ్లు

author img

By

Published : Dec 30, 2022, 3:18 PM IST

1999లో చనిపోయిన వ్యక్తి.. 2021లో తన భూమిని వేరేవారికి రిజిస్ట్రేషన్ చేశాడు. నమ్మశక్యంగా లేదు కదూ. అతడికి ఆధార్‌ కార్డు కూడా వచ్చింది. కామారెడ్డి గాంధీనగర్‌లో ఈ ఘటన జరిగింది. ఎప్పుడో చనిపోయిన లక్ష్మణ్‌రావు పేరిట నకిలీ ఆధార్‌ సృష్టించి భూమి కాజేశారు. సూపర్‌హిట్టైన తెలుగు సినిమాలోని ఓ సన్నివేశాన్ని తలపిస్తోన్న ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.

land roberry in Kamareddy district
కామారెడ్డి జిల్లాలో కబ్జారాయుళ్ల దొపిడి

1999లో చనిపోయిన వ్యక్తి పేరిట ఆధార్‌ సృష్టించి భూమిని విక్రయించిన కేటుగాళ్లు..

"1984లో మా తాతా ఈ స్థలం కొన్నాడు. మా నాయనమ్మ చనిపోయిన తర్వాత స్థలం ఎలా ఉందో చూసి పోదాం అని వస్తే ప్లాటులో కంకర ఉంది. ఎందుకు మా స్థలంలో కంకర వేశారని అడిగితే ఈ ప్లాటు సంవత్సవరం క్రితం కొందరు ముస్లింలు మాకు అమ్మేశారని చెప్పారు. మా తాతయ్య చనిపోయింది 1999. రిజిస్ట్రేషన్ జరిగింది 2021లో. మా తాత ఎలా స్థలం అమ్మాడని ఆశ్చర్యం కలిగింది. చనిపోయిన వ్యక్తి ఆధార్​ కార్డు సృష్టించి కబ్జారాయుళ్లు మా స్థలాన్ని కబ్జా చేశారు. మాకు న్యాయం జరగాలి. ఈ దారుణాన్ని మేము కోర్టులోనే తేల్చుకుంటాం."- బాధితుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.