ETV Bharat / state

సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్సియల్​ వసతిగృహంలో బాలికలకు అస్వస్థత

author img

By

Published : Dec 4, 2019, 12:06 AM IST

దోమకొండలోని సోషల్​ వెల్ఫేర్​ రెసిడెనిషియల్​ బాలికల వసతిగృహంలో 82 మంది విద్యార్థులు చర్మ సంబందిత రుగ్మతతో అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు చర్మంపై దద్దర్లతో ఇబ్బంది పడ్డారు.

domarakonda social welfare residential educational
సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్సియల్​ వసతిగృహంలో బాలికలకు అస్వస్థత

కామారెడ్డి జిల్లా దోమకొండ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్​ సొసైటీ బాలిక వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. 82 మంది విద్యార్థులకు చర్మంపై దురదలు, దద్దుర్లు వచ్చాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉండడం వల్ల కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న బీబీపేట పీహెచ్​సీ వైద్య సిబ్బంది హుటాహుటిన వసతి గృహానికి వెళ్లి బాలికలకు వైద్య సహాయం అందించారు.

శరీరంపై ఒక రకమైన క్రిములు పాకడం వల్ల గానీ, కరవడం వల్ల ఈ విధంగా జరిగి ఉండవచ్చని వైద్యులు తెలిపారు. విద్యార్థినులకు ప్రాథమిక చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్సియల్​ వసతిగృహంలో బాలికలకు అస్వస్థత

ఇదీ చూడండి: 'బిగ్ బజార్​లో నాసిరకమే కాదు... తేదీ ముగిసినవి కూడా'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.