ETV Bharat / state

'మిగితా పంటను ఎక్కడ అమ్ముకోవాలి'

author img

By

Published : Feb 6, 2020, 3:32 PM IST

కందులు కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ 44వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కందులు కొంటామని చెప్పిన అధికారులు మార్కెట్​కు తీసుకొచ్చాక ఎకరాకు 2 కింటాళ్లే కొంటున్నారని మిగితా పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు.

Where to sell the rest of the Lentils crop at alampur gadwal district
'మిగితా పంటను ఎక్కడ అమ్ముకోవాలి'

జోగులాంబ గద్వాల్ జిల్లాలో కందులను కొనాలని అలంపూర్ చౌరస్తా 44వ నంబర్ జాతీయ రహదారిపై రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. రైతుల విషయంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

కందులు కొంటామని చెప్పిన అధికారులు రైతులు మార్కెట్​కు తీసుకొచ్చాక ఎకరాకు 2 కింటాళ్లే కొంటామంటే మిగితా పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. మార్కెట్​లో రైతులకు సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. సంఘటన స్థలం నుంచే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే రైతుల దగ్గరున్న కందులు మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

'మిగితా పంటను ఎక్కడ అమ్ముకోవాలి'

ఇదీ చూడండి : మేడారం జాతరకు హెలికాప్టర్​ సేవలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.