ETV Bharat / state

ఎమ్మెల్యేలందరూ ఈ కార్యక్రమం చేపట్టాలి: ఎంపీ రాములు

author img

By

Published : Dec 17, 2020, 6:07 PM IST

గద్వాల ఎమ్మెల్యే చేపట్టిన 'గడప గడపకు పిడికెడు బియ్యం' కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ చేపట్టాలని ఎంపీ రాములు కోరారు. వినూత్న పద్ధతిలో రైతుల ఉద్యమానికి మద్దతు తెలపాలని సూచించారు.

mp ramulu press meet at jogulamba district
ఎమ్మెల్యేలందరూ ఈ కార్యక్రమం చేపట్టాలి: ఎంపీ రాములు

రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా భాజపా వ్యహరిస్తోందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు ధ్వజమెత్తారు. జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో రాములు మాట్లాడారు. రైతులు 20 రోజుల నుంచి దిల్లీ కేంద్రం నిరసనలు, ధర్నాలతో అట్టుడుకుతున్నా.. కేంద్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

"పంటలకు కనీస మద్దతు ధర ఉంటే బాగుండేది. దీనిపై పార్లమెంట్​లో చర్చించకుండా మూజువాణి పద్ధతిన ఓటు వేసి 3 చట్టాలను అమలు చేయడం బాధాకరం. దీనికి వినూత్నమైన పద్ధతిలో గద్వాల ఎమ్మెల్యే 'గడప గడపకు పిడికెడు బియ్యం' కార్యక్రమం చేపట్టారు. దీనికి విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ ఈ కార్యక్రమం చేపట్టి ప్రజలను చైతన్య పరచాలి."

-రాములు, నాగర్ కర్నూల్ ఎంపీ

ఇదీ చూడండి: వరాహావతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.