ETV Bharat / state

Bonkur Palakova : బొంకూరు పాలకోవా.. వారెవ్వా ఆ రుచే వేరయ్యా..

Bonkur Palakova : బొంకూరు.. స్వచ్ఛమైన పాలకోవాకు పెట్టింది పేరు. నాలుగైదు దశాబ్దాల నుంచి అక్కడి 3 కుటుంబాలకు పాలకోవా తయారే జీవనాధారం. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో పాలకోవా తయారీ కేంద్రాలు చాలచోట్ల ఉన్నా.. బొంకూరు కోవాకున్న రుచి, నాణ్యత వేరు. అందుకే బొంకూరు నుంచి కర్నూల్, అలంపూర్, గద్వాల, హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు పాలకోవా తీసుకువెళ్తుంటారు. ఇంతకీ ఈ బొంకూరు పాలకోవా ప్రత్యేకతలేంటోతెలుసుకుందామా..

Bonkur Famous Pikka kova
Bonkur Famous For Palakova బొంకూరు పాలకోవా.. వారెవ్వా ఆ రుచే వేరాయ్యా.. ఆ కుటుంబం వంటకం అక్కడివారికీ సుపరిచితం
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 12:21 PM IST

Updated : Oct 5, 2023, 1:33 PM IST

Bonkur Palakova బొంకూరు పాలకోవా.. వారెవ్వా ఆ రుచే వేరయ్యా..

Bonkur Palakova : జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరు.. స్వచ్ఛమైన పాలకోవాకు ఈ గ్రామం పెట్టింది పేరు. ఈ గ్రామంలో 3 కుటుంబాలు దశాబ్దాలుగా పాలకోవా తయారీయే జీవనాధారంగా పనిచేస్తున్నాయి. తాతలు, తండ్రుల నుంచి వచ్చిన వృత్తిని అలాగే కొనసాగిస్తున్నాయి. కాసిం, షాలీ బాషా, రసూల్ బాషా ముగ్గురు అన్నదమ్ములు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన పాలకోవా తయారీని జీవనోపాధిగా మార్చుకుని 50 ఏళ్లుగా అదే తమ వృత్తిగా కొనసాగుతున్నారు.

The Famous Bonkur Palakova : ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలాచోట్ల పాలకోవా తయారీ కేంద్రాలున్నాయి. అక్కడితో పోల్చితే బొంకూరు పాలకోవా భిన్నంగా, రుచికరంగా, నాణ్యంగా ఉంటుంది. కారణం ఆధునాతన పద్ధతులు కాకుండా పాత విధానంలో కోవా తయారీని వీళ్లు కొనసాగిస్తున్నారు. కోవా తయారికీ స్వచ్ఛమైన పాలు వినియోగిస్తారు. నిత్యం ఉదయాన్నే రైతుల వద్దకు వెళ్లి పాలు సేకరిస్తారు. పాలు వారి ముందే పితకాలి. నీళ్లు కలపకూడదు. పాలల్లో నీళ్లు కలిపితే కోవా నాణ్యత దెబ్బతింటుంది. రుచి మారిపోతుంది. నిల్వ ఉండదు. అందుకే స్వచ్ఛమైన పాలనే సేకరిస్తారు.

Bonkur Famous Pikka kova : అలా సేకరించిన పాలను కట్టెల పొయ్యిమీద నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. బాగా మరిగాక అందులో చక్కెర కలిపి కోవా చేస్తారు. అందులో మూడు రకాల కోవాలున్నాయి. సాధారణంగా చక్కెరతో చేస్తారు. చక్కెర వద్దనుకునే వారికి బెల్లం కలిపి చేస్తారు. ఏం కలపకుండా పాలను మరిగించి తయారు చేసే కోవా.. పిక్కా కోవా. దీన్ని వంటల్లో స్వీట్ల తయారీ (Sweets Preparation)కోసం వినియోగిస్తారు. ఎక్కువగా శుభకార్యాలు(Subhakaryalu) జరుగుతున్నప్పుడు పిక్కా కోవా తీసుకువెళ్తారు. ఈ మూడు రకాల కోవాలను ఆర్డర్ల మీద ఈ మూడు కుటుంబాలు తయారు చేస్తాయి. ఎన్నిరోజులు నిల్వ ఉండాలన్న దాన్ని బట్టి కూడా తయారీ ఉంటుంది.

ఇందూరు వాసుల సంక్రాంతి స్పెషల్ ఫేవరేట్.. ఈ ​ఘేవర్ స్వీట్

Bonkur Khoa : నిత్యం ఒక్కో కుటుంబం 20 నుంచి 30 కేజీలు తయారు చేసి కర్నూలులో పలు ప్రాంతాల్లో విక్రయిస్తారు. కావాల్సిన వినియోగదారులు ఇంటికొచ్చి మరీ తీసుకువెళ్తారు. అవి కాకుండా ఆర్డర్లపై బేకరీలు, శుభకార్యాలకు సైతం సరఫరా చేస్తారు. అలంపూర్, గద్వాల, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి వీరికి క్రమం తప్పకుండా తీసుకువెళ్లే వినియోగదారులు ఉన్నారు. చక్కెర పాలకోవా కిలో 260, బెల్లం కోవా కిలో 300, పిక్కా కోవా రూ.600కు విక్రయిస్తారు.

కట్టెల పొయ్యిపై చేస్తే ఆ రుచి అమోఘం : ఇతర ప్రాంతాల్లో తయారయ్యే కోవాకు.. బొంకూరు కోవా తయారీకి తేడా ఉంది. ప్రస్తుతం ఆధునాతన యంత్రాలు(Advanced Machines) రావడంతో యంత్రాల సాయంతో కోవా వేగంగా.. ఎక్కువ మొత్తంలో తయారు చేస్తున్నారు. యంత్రాల ద్వారా తయారయ్యే కోవా ఎక్కువ కాలం నిల్వ ఉండదని.. అదే సమయంలో కట్టెల పొయ్యిపై వండిన రుచి రాదని అంటున్నారు ఆ సోదరులు.

యంత్రాలకైతే రుణాలిస్తారమని బ్యాంకులు చెప్పినా.. నాణ్యత దెబ్బతినకూడదన్న కారణంతో బ్యాంకు నుంచి రుణాలు కూడా తీసుకోలేదని చెబుతున్నారు. కోవా తయారీతో పెద్దగా లాభాలు లేకపోయనా.. కుటుంబం గడుస్తోందని.. అర్ధికంగా ఎవరైనా సహకరిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు తయారీ దారులు తెలిపారు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన వృత్తిని కొనసాగించాలని.. బొంకూరు కోవాకున్న నాణ్యత, పేరు చిరస్థాయిగా నిలిపేందుకే అక్కడి కుటుంబాలకు శ్రమిస్తున్నాయి. ఒక తరం నుంచి మరో తరానికి తయారీ విధానాన్ని అందిస్తున్నాయి.

రెండు కేజీల బాహుబలి కజ్జికాయ తినే పోటీ.. ఎంత మంది తిన్నారంటే?

రాఖీ స్పెషల్​ స్వీట్.. ఇంట్లో మీరే సింపుల్​గా చేసేయండిలా...

Last Updated : Oct 5, 2023, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.