ETV Bharat / state

సింగరేణిలో వరుస ప్రమాదాలు.. గాలిలో దీపంలా కార్మికుల ప్రాణాలు!

author img

By

Published : Apr 9, 2021, 8:14 PM IST

singareni accidents
సింగరేణిలో వరుస ప్రమాదాలు

ఘనమైన చరిత్ర కలిగి.. నిత్యం వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణిలో ప్రమాదాల పరంపరకు అడ్డుకట్ట పడటం లేదు. రక్షణ చర్యలు అంతమాత్రంగానే ఉండడం వల్ల గనిలోకి వెళ్లే కార్మికుల ప్రాణాలు గాలిలో దీపంలో మారుతున్నాయని కార్మిక సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సింగరేణిలో వరుస ప్రమాదాలు.. గాలిలో దీపంలా కార్మికుల ప్రాణాలు!

గనిలో ఉద్యోగం నిత్యం ప్రాణసంకటంగా మారింది. విధులకు వెళ్లినవారు క్షేమంగా ఇంటికి చేరేవరకు భరోసా ఉండడం లేదు. గనిలో తరచూ జరిగే ప్రమాదాలు కార్మికులను అర్ధాయుష్కులును చేస్తున్నాయి. శ్రామికుడినే నమ్ముకుని జీవిస్తున్న వారి కుటుంబాలను దిక్కులేనివారిగా రోడ్డున పడుతున్నాయి.

రెండు నెలల క్రితమే లేఖ రాసినా..

ఇటీవల భూపాలపల్లి కేటీకే ఆరో ఇంక్లైన్‌లో ఇద్దరు కార్మికులు మృత్యవాతపడ్డారు. గనిలో పైకప్పుకు దిమ్మెలు ఏర్పాటు చేసే ముందు రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఓవర్‌మెన్, సర్దార్‌ల పర్యవేక్షణలో పనులు జరగాల్సి ఉన్నా... అవగాహన లేని కార్మికులతో పనులు చేయించడం నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. పైకప్పు బలహీనంగా ఉన్న ప్రాంతంలో పనిచేయడం ప్రమాదకరమంటూ రెండు నెలల క్రితం ఉన్నతాధికారులకు ఓవర్‌మెన్ లేఖ రాసినా పట్టించుకోలేదు.

ఆరేళ్లలో 59 మంది మృతి..

సరైన పర్యవేక్షణ లోపించడం రక్షణ వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారి గనుల్లో ప్రమాదాలు రివాజుగా మారాయి. ఆరేళ్లలో సింగరేణి వ్యాప్తంగా దాదాపు 59 మంది కార్మికులు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. రక్షణ చర్యలు పూర్తిగా నియంత్రించడంలో యాజమాన్యం వైఫల్యం చెందుతోందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.

అలా చేస్తేనే..

ఉత్పత్తి, లక్ష్యాల సాధన మీదున్న శ్రద్ధ... కార్మికుల భద్రత మీద చూపడం లేదన్నది కార్మికుల మాట. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు పకడ్బందీగా చేపడితేనే ప్రమాదాలు పునరావృతం కావని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవీచూడండి: కేటీకే ఆరో గనిలో ప్రమాదం... ఇద్దరు కార్మికులు దుర్మరణం

'సింగరేణి మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.