ETV Bharat / state

Medigadda Barrage Bridge Pillars Slightly Sagged : కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన.. డ్యామ్ పరిసరాల్లో అలర్ట్.. రాకపోకలకు బ్రేక్

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 10:46 AM IST

Medigadda Barrage Pillars Slightly Sagged
Medigadda Barrage Pillars Slightly Sagged

Medigadda Barrage Bridge Pillars Slightly Sagged : కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీపై.. రాకపోకలు సాగించే వంతెన కుంగడం సర్వత్రా ఆందోళన కలిగించింది. బ్యారేజీ 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద ఓ అడుగు మేర వంతెన కుంగింది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. ఇవాళ ఇంజినీరింగ్ నిపుణులు.. బ్యారేజీని క్షుణ్నంగా పరిశీలించనున్నారు.

Medigadda Barrage Pillars Slightly Sagged భారీ శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన

Medigadda Barrage Bridge Pillars Slightly Sagged : జల ప్రదాయినిగా పేరుగాంచిన కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ (Medigadda Barrage) వంతెన కొంతమేర కుంగింది. శనివారం రోజు పొద్దుపోయాక భారీ శబ్దంతో బీ-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు భావిస్తున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా కుంగిన ప్రాంతం మహారాష్ట్రవైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యామ్ పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు.

Kaleshwaram Project : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ఘట్టం ఆవిష్కృతం... ఏకకాలంలో 35 మోటార్లు రన్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరిపై 2019లో మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. వంతెన కుంగిన సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25,000 క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా.. 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో ఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల నిల్వ ఉంది. శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

Lakshmi Barrage Bridge Bent in Jayashankar Bhupalapally District : ఆ సమయంలో మరికొన్ని శబ్దాలు రావడంతో ఉన్నతాధికారులకు తెలియజేశారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన జలాశయాన్ని ఖాళీచేసే చర్యలు మొదలుపెట్టారు. తొలుత 12 గేట్లు.. ఆ తర్వాత వాటిని 46కు పెంచి.. దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దాదాపు 50,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేరకు ప్రాజెక్టును ఖాళీ చేసి.. వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది పరిశీలించనున్నారు. బ్యారేజీ పరిసరాల్లోకి అధికారులు ఎవరినీ అనుమతించట్లేదు.

కోతకు గురైన మేడిగడ్డ బ్యారేజీ గ్రావిటీ కాలువ, కరకట్ట.. 100 మీటర్ల మేర!

Slightly Bent Medigadda Barrage Bridge : శబ్దం రావడంతో.. డ్యాం ఇంజినీర్లు.. తెలంగాణవైపు మహాదేవ్‌పూర్‌.. మహారాష్ట్రవైపు సిరోంచ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్అండ్‌టీ గుత్తేదారు నిపుణులు అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని పరిశీలించిన ఈఈ తిరుపతిరావు.. చీకటిగా ఉండటంతో ఏం జరిగిందో స్పష్టత లేదని తెలిపారు. డ్యాం పైభాగంలో భారీ శబ్దం వచ్చిందని ఇంజినీర్లు సమాచారం అందించారని.. రామగుండం ఇంజినీర్ ఇన్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని : గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరదను డ్యాం ఎదుర్కొందని.. నాడు రాని శబ్దాలు ఇప్పుడు రావడంపై పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజినీర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉన్నందున.. అవసరమైన మరమ్మతులు ఉంటే చేపడతామని పేర్కొన్నారు.

Kaleswaram Project : కాళేశ్వరం నుంచి కొనసాగుతున్న ఎత్తిపోతలు

kaleshwaram project water level : కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ వరద.. పలు బ్యారేజీల గేట్లు ఎత్తి నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.