ETV Bharat / state

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Sep 4, 2020, 10:34 PM IST

భూపాలపల్లి తహసీల్దార్​ కార్యాలయం ముందు ఓ రైతు కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్వో అక్కడకు వచ్చి.. వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన తన దగ్గరకు స్వయంగా రావాలని తహసీల్దార్​ సూచించారు.

suicide attempt by farmer at bhupalpally
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి తహసీల్దార్​ కార్యాలయం ముందు ఓ రైతు కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. జిల్లాలోని గొర్లవేడు గ్రామానికి చెందిన మామిడివెంకులు..తన 30 ఎకరాల భూముని తన ముగ్గురు కొడుకులకు సమానంగా పంచాడు. మొత్తం భూమిని స్థానిక రాజకీయ నాయకుల అండతో తన పెద్ద కొడుకు పేరు మీదకు మార్చుకున్నాడంటూ రెవెన్యూ అధికారులను అడగగా తమకు సంబంధం లేదని మాటదాటేస్తున్నారని రైతు వాపోయాడు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబంతో కలిసి పురుగుల మందు డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

విషయం తెలుసుకున్న తహసీల్దారు అశోక్​ అక్కడకు వచ్చి విషయం తెలుసుకుని వారికి తగిన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఏ రైతులకైనా సమస్యలుంటే నేరుగా కార్యాలయంలో తనను సంప్రదించాలని.. ఇలా పురుగుల మందు డబ్బాతో ఆందోళనలు చేయవద్దని ఆయన సూచించారు. ఇలా చేస్తే క్రిమినల్​ కేసులు పెడతామని హెచ్చరించారు.

ఇవీచూడండి: ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.