ETV Bharat / state

ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన... జీవన్​రెడ్డి మద్దతు

author img

By

Published : Dec 20, 2019, 10:05 PM IST

జగిత్యాలలో ముస్లింలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్ఆర్సీ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మద్దతు తెలిపారు.

MUSLIMS PROTEST AGAINST NRC BILL IN JAGITYAL
MUSLIMS PROTEST AGAINST NRC BILL IN JAGITYAL

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. జగిత్యాలలో ముస్లింలు భారీ ఆందోళన నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఖిలా సమీపంలోని జమా మసీదు వద్ద ఆందోళనకు దిగారు. ముస్లింలకు మద్దతుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి సంఘీభావం పలికారు. సెక్యూలర్​ దేశంగా ఉన్న భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా భాజపా సర్కారు నిర్ణయాలు తీసుకుంటోందని జీవన్​రెడ్డి మండిపడ్డారు. ఎన్‌ఆర్సీ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన... జీవన్​రెడ్డి మద్దతు

ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.