ETV Bharat / state

Harish Rao warning: మందులు బయటకు రాస్తే వైద్యులపై చర్యలు: హరీశ్ రావు

author img

By

Published : May 4, 2022, 3:59 PM IST

Harish Rao warning: రాష్ట్రంలో ప్రైవేట్​కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మాతా, శిశు మరణాలను తగ్గించడంలో మనమే ముందున్నామని వెల్లడించారు. జగిత్యాలలో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

HARISH RAO IN JAGTIAL
హరీశ్ రావు

Harish Rao warning: సర్కారు దవాఖానాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా 56 రకాల పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యులెవరైనా మందులు బయటకు రాస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాలలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

ప్రైవేట్​కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య తగ్గటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 56 శాతం ఉంటే జగిత్యాలలో 44 శాతం ఉందన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గించడంలో ముందున్నామని తెలిపారు.

ఒక్క పైసా ఖర్చు లేకుండా 56 రకాల పరీక్షలు చేస్తున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తాం. మాతా, శిశు మరణాలను చాలా తగ్గించాం. ఆ విషయంలో తమిళనాడును అధిగమించాం. సర్కారు దవాఖానాలో మందులు లేవనే మాట రాకూడదు. వైద్యులెవరైనా బయటకు మందులు రాస్తే వెంటనే చర్యలు. మన ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరగాలే. అందుకోసం మనందరం కలిసి కృషి చేయాలి.

- హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

జగిత్యాలలో ఏర్పాటు చేసిన మాతా శిశు కేంద్రంలో ఒకేసారి 12 మందికి ప్రసవాలు జరిగేలా చేసేలా లేబర్‌రూంలు, ఐసీఐయూ ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్‌కు వెళ్లకుండా ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు కలిసి పని చేయాలని సూచించారు. ప్రైవేట్‌కు వెళితే బాధ్యత మీదేనని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 వైద్య కళాశాలలు ఉంటే 33 కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మూడే ఉన్న డయాలసిస్ కేంద్రాలను 102 కు పెంచుకున్నామని వెల్లడించారు. సాధారణ ప్రసవాలు చేసిన వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రోత్సహకాలు అందిస్తామన్నారు.

మందులు బయటకు రాస్తే వైద్యులపై చర్యలు: హరీశ్ రావు

ఇవీ చూడండి: ఓయూలో రాహుల్‌గాంధీ ముఖాముఖి కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎన్‌ఎస్‌యూఐ

'మోకాళ్ల యాత్రే చేస్తారో.. మోకరిల్లుతారో.. బోర్డు మాత్రం పట్టుకురండి..'

వృద్ధుడి గొప్ప సంకల్పం.. మండుటెండలో 26 ఏళ్లుగా అదే పని..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.