ETV Bharat / state

పాలపై మాతృమూర్తి బొమ్మ వేసిన సూక్మకళాకారుడు

author img

By

Published : May 9, 2021, 11:40 AM IST

మాతృమూర్తి బొమ్మను పాలపై వేసి తమ ప్రేమను చాటుకున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన సూక్మ కళాకారుడు. మాతృదినోత్సవం సందర్బంగా తల్లిప్రేమ తెలియజేసేందుకే ఈ చిత్రాన్ని వేశానని ఆయన పేర్కొన్నాడు.

Jagittala artist who created the mother point on milk
పాలపై తల్లి బొమ్మ వేసిన కళాకారుడు


మాతృ దినోత్సవం సందర్భంగా పాలపై తల్లి బొమ్మ వేసి అందరిని అబ్బురపరిచాడు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాగవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, సైకతశిల్పి గాలిపల్లి చోళేశ్వర్ చారి. మాతృమూర్తికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు.

పాలిచ్చి పెంచే అమ్మ చిత్రాన్ని పాలమీద వేయడం సంతోషంగా ఉందని చోళేశ్వర్ చారి అన్నారు. ప్రతి జీవికి అమ్మ ప్రేమ ఒక్కటేనని.. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చుకోలేమని ఆయన వివరించారు. అందుకోసమే ఈ బొమ్మను వేసినట్లు తెలిపారు.

పాలపై తల్లి బొమ్మ వేసిన కళాకారుడు
ఇదీ చదవండి: మదర్స్​ డే స్పెషల్​: అమ్మను మించి దైవమున్నదా?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.