ETV Bharat / state

త్వరలో చేనేత కార్మికులతో విపక్షాల మహా ధర్నా...!

author img

By

Published : Feb 5, 2020, 10:19 PM IST

weavers jac meet with Opposition leaders
త్వరలో చేనేత కార్మికులతో మహా ధర్నా...!

తెలంగాణ ఏర్పడ్డాక కూడ చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగు ఎక్కడ అని ప్రభుత్వాన్ని విపక్షసభ్యులు ప్రశ్నించారు. నేతన్నల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సర్కారు నిర్లక్ష్యాన్ని గుర్తుచేసేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మహాధర్నా నిర్వహించాలని విపక్షనేతలు నిర్ణయించారు.

హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చేనేత సమస్యల సాధనకై నేతన్నల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అఖిలపక్ష విస్తృత స్థాయి రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సదస్సుకు తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, పార్టి పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మహాధర్నా చేపడదామన్న కోదండరాం

ఆధునిక మెషిన్లతో... నేటి చేనేతరంగం పోటీపడే స్థితిలో లేదని తెతెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిస్తేనే నైపుణ్యత కొనసాగుతూ... నేతన్నల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. రాజ్యాధికారం రియల్‌ ఎస్టేట్‌ డీలర్లు, గుత్తేదారుల చేతిలో ఉందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. చేనేత కార్మికుల హక్కుల సాధన కోసం బడ్జెట్‌ సమావేశాలకు ముందు పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

ఇప్పటివరకు ఎంతిచ్చారో చెప్పగలరా..!

తెలంగాణ ఏర్పడ్డాక... చేనేత రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికుల సమస్యల సాధనలో సీపీఐ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.

త్వరలో చేనేత కార్మికులతో మహా ధర్నా...!

ఇదీ చూడండి: బండెనక బండి కట్టి... మేడారానికి బండి కట్టి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.