ETV Bharat / state

వాణిజ్య విపణిలో సత్తా చాటేందుకు విశాఖ పోర్టు సన్నాహాలు

author img

By

Published : Dec 2, 2020, 10:24 PM IST

ఏపీలోని విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ భారీ నౌకల రాకపై దృష్టి పెట్టింది. రెండు రోజుల క్రితం భారీ నౌకను ఇన్నర్ హార్బర్​లోకి ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తీసుకురావటంతో పోర్టు వర్గాల్లో ఉత్సాహం పెరిగింది. ఇప్పటివరకు ఉన్న అడ్డంకులను అధిగమిస్తూ, ఇతర పోర్టులకు ధీటుగా మౌలిక అంశాలపైనా, వ్యాపార కార్యకలాపాల పెంపుదలపైనా విశాఖ పోర్టు ప్రణాళికను సిద్ధం చేసింది.

వాణిజ్య విపణిలో సత్తా చాటేందుకు విశాఖ పోర్టు సన్నాహాలు
వాణిజ్య విపణిలో సత్తా చాటేందుకు విశాఖ పోర్టు సన్నాహాలు

వాణిజ్య విపణిలో సత్తా చాటేందుకు విశాఖ పోర్టు సన్నాహాలు

నవంబర్​ 30న ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పోర్టు చ‌రిత్రలో తొలిసారిగా ఓ భారీ నౌక ఇన్నర్​ హార్బర్​లోకి ప్రవేశించింది. విశాఖ పోర్టులో ఇంత‌వ‌ర‌కు కేవ‌లం 230 మీట‌ర్ల పొడ‌వు, 32.5 మీట‌ర్ల బీం ఉన్న నౌక‌ల‌ను మాత్రమే హ్యాండిల్ చేసే అవ‌కాశం ఉంది. అయితే విశాఖ పోర్టు అధికారుల బృందం 2019 సెప్టెంబ‌ర్​లో సింగ‌పూర్​లో అనుకరణ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ద్వారా భారీ నౌకలు సైతం ఇన్నర్ హార్బర్​లోకి ప్రవేశించే అవకాశం కలిగింది. అనుకరణ అధ్యయనం తర్వాత మొట్టమొదటిసారి భారీ నౌకని ఇన్నర్ హార్బర్​లోకి తీసుకురావడం ద్వారా పోర్టు సామర్థ్యం వాణిజ్య విపణిలో వెల్లడైంది.

ఇదే ఉత్సాహంతో ఆసియా, ఆఫ్రియా ఖండాల నుంచి అతి భారీ నౌకలను తీసుకువచ్చేందుకు విశాఖపోర్టు యత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన బృందం చురుగ్గా యత్నాలు ఆరంభించింది. ఇంత అత్యధిక సామర్థ్యం ఉన్న నౌకలు ప్రపంచంలో దాదాపు వందల్లోనే ఉన్నట్టు అంచనా. ఇందులో ఐదారు శాతం నౌకలను రప్పించినా విశాఖ పోర్టు వాణిజ్యం మరింత జోరందుకునే అవకాశం ఏర్పడుతోంది.

ఇదీ చదవండి: బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.