ETV Bharat / state

ప్రభాస్‌ను కలవనున్న కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా..

author img

By

Published : Sep 14, 2022, 9:00 PM IST

Union ministers to meet prabhas: హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షాలు హీరో ప్రభాస్‌ను పరామర్శించనున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలపనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు తెలిపారు.

హీరో ప్రభాస్‌ను కలవనున్న కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా.. అందుకోసమేనా..?
హీరో ప్రభాస్‌ను కలవనున్న కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా.. అందుకోసమేనా..?

Union ministers to meet Prabhas: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నెల 16న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో నిర్వహించే కృష్ణంరాజు సంతాప సభలో పాల్గొంటారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం రాజ్‌నాథ్‌సింగ్‌ తిరిగి దిల్లీకి పయనం కానున్నారు.

amit shah to meet prabhas: మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం ప్రభాస్‌ను పరామర్శించనున్నారు. ఈ నెల 17న ఉదయం 7:30 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం భాజపా జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు ఇతర ముఖ్యనేతలతో అమిత్ షా భేటీ అవుతారు. అయితే ఈ భేటీల అనంతరం అమిత్‌షా ప్రభాస్‌ను కలుస్తారా.. లేక 16 తేదీనే రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి పరామర్శిస్తారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

ఇవీ చూడండి..

'కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరుపై లేదు..'

రూ.2వేల కోసం గొడవ.. భర్తను చావబాది, యాసిడ్ పోసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.