ETV Bharat / state

Kishan Reddy: 'కొవిడ్​ను అరికట్టాలంటే.. వ్యాక్సినేషన్ తప్పనిసరి'

author img

By

Published : Jan 14, 2022, 3:00 PM IST

kishan reddy
కిషన్​ రెడ్డి

Kishan Reddy: కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి సూచించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలో పలు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

Kishan Reddy: కొవిడ్​ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ తీసుకోవాలని.. 60 ఏళ్ల పైబడిన వారందరూ తప్పనిసరిగా బూస్టర్​ డోసు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని గాంధీనగర్​ డివిజన్​లో నూతన సీసీ రోడ్డు, కమ్యూనిటీ భవనం నిర్మాణాల పనులను కిషన్​ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్​, స్థానిక కార్పొరేటర్​ పావని పాల్గొన్నారు.

పండుగల సందర్భంగా ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలి. ప్రజల సహకారం లేకుండా కరోనాను అరికట్టలేము. వైరస్​ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ రెండు డోసులూ తీసుకోవాలి. కొవిడ్​ నివారణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలి.

- కిషన్​ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి

కేంద్రం అందించే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనులను పూర్తి చేస్తామని కిషన్​ రెడ్డి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి.. కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.

కొవిడ్​ను అరికట్టాలంటే.. వ్యాక్సినేషన్ తప్పనిసరి: కిషన్​ రెడ్డి

ఇదీ చదవండి: Headmasters Transfers From Sangareddy : ఒక్క సంగారెడ్డి నుంచే 40 మంది హెచ్‌ఎంల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.