ETV Bharat / state

Kishan Reddy fires on CM KCR : 'సీఎం కేసీఆర్‌ నీతిఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోవడం దురదృష్టకరం'

author img

By

Published : May 27, 2023, 1:53 PM IST

Updated : May 27, 2023, 2:51 PM IST

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy fires on CM KCR : రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... సీఎం కేసీర్‌ నీతిఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోవడం దురదృష్టకరం అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతి కార్యక్రమం అప్పులతోనే చేస్తోందన్న కిషన్​రెడ్డి... 30వేల ఎకరాలు అమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Kishan Reddy fires on CM KCR : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి మరోసారి తనదైన శైలిలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కిషన్​రెడ్డి... దిల్లీలో జరుగుతున్న 8వ నీతి ఆయోగ్ సమావేశాలకు తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్లకుపోవడంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Kishanreddy on Niti Aayog Council Meeting : రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... సీఎం కేసీర్‌ నీతిఆయోగ్‌ సమావేశానికి వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత, రాక ముందు... రాష్ట్రంలో ఎంత ఆదాయం ఉన్నదో చెప్పాలని కిషన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. సీఎం కేసీఆర్​కి చిత్తశుద్ది ఉంటే... ఏయే సంస్థల నుంచి ఎంత అప్పులు చేశారో వివరించాలని కోరారు.

ప్రభుత్వ చేతకాని తనం వల్లే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు ఇంకా పంపిణీ చేయలేదని అన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవు, నిరుద్యోగ ఆత్మహత్యలు లేవని కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా దేశం అంతా శతాబ్ది ఉత్సవాలను ప్రచారం చేస్తున్నారని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు.

'ఒకవైపు రైతులకు రూ.50వేల కోట్ల అప్పులు తీర్చాలి. మరోవైపు అప్పులు ముంచుకొస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా నీతి ఆయోగ్​కు వెళ్ళలేదు. రాష్ట్రంలో ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారు. పాత అప్పులకు వడ్డీలు చెల్లించడం లేదు. రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం అప్పులతోనే చేస్తున్నారు. సుమారు 3.5లక్షల కోట్లు అప్పులు చేశారు. 30వేల ఎకరాలు అమ్మాలని చూస్తున్నారు. జీవో 111 ఇందుకోసమే ఎత్తేశారు.. ఇలాగే అయితే తెలంగాణ భవిష్యత్తు పరిస్తితి ఏంటి ? చివరకు వరంగల్ జైలు భూములు కూడా తాకట్టు పెట్టాలని చూస్తున్నారు.' - కిషన్​ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలా వ్యవహారిస్తోంది : తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని సీఎం కేసీఆర్ మాట తప్పారని కిషన్​రెడ్డి ఆరోపించారు. అప్పటి నుంచి మాట తప్పుతూనే ఉన్నారన్న ఆయన... కంటోన్మెంట్​లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి 10ఎకరాలు భూమిని కేటాయించారని ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్, కాంగ్రెస్ పార్టీలు వందల కోట్ల విలువ చేసే భూములు తీసుకున్నాయన్న కిషన్​రెడ్డి... పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇళ్లకు స్థలాలు ఇవ్వరని మండిపడ్డారు. ప్రభుత్వం ఏమైనా రియల్ ఎస్టేట్ కంపెనీనా.. ఎక్కడ చూసిన భూములను ప్లాట్లు చేసి అమ్ముతున్నారని విమర్శించారు.

నీతిఆయోగ్‌ సమావేశానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం దురదృష్టకరం : కిషన్​రెడ్డి

ఇవీ చదవండి :

Last Updated :May 27, 2023, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.