ETV Bharat / state

'ఆర్టీసీ ఆదాయం ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది'

author img

By

Published : Nov 9, 2019, 4:53 AM IST

'ఆర్టీసీ ఆదాయం ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది'

ఆయిల్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం విషయంలో ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేలా ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఆరోపించారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులకు డీలర్ షిప్ అప్పగించిన విషయంలో... డీలర్ షిప్ రద్దు చేయాలని హెచ్​పీసీఎల్ తెలంగాణ డివిజనల్ మేనేజర్ రాజేష్​కు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి వినతి పత్రం అందించారు.

'ఆర్టీసీ ఆదాయం ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది'
రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థకు వివిధ పట్టణాలలో అత్యంత విలువైన స్థలాలున్నాయని... వాటిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకుని సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆర్టీసీ ఒప్పందం చేసుకుందని తెలిపారు. సమ్మె కారణంగా ఒప్పందాన్ని పక్కకు పెట్టి ఆర్టీసీ ఆదాయం ప్రైవేట్​ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అక్రమమని మల్లారెడ్డి ఆరోపించారు.

ఇవీ చూడండి: "ఇంకెన్ని వాయిదాలు తీసుకుంటారు"

Intro:సికింద్రాబాద్ ....యాంకర్
ఆయిల్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం విషయం లో ఆర్టీసీ ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేలా ఉల్లంఘన లకు పాల్పడుతుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఆరోపించారు.. ప్రైవేట్ వ్యక్తులకు డీలర్ షిప్ అప్పగించిన విషయంలో ...డీలర్ షిప్ రద్దు విషయం లో ....HPCL తెలంగాణ డివిజనల్ మేనేజర్ రాజేష్ కు వినతి పత్రం సమర్పించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి...తెలంగాణ రాష్ట్రం లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్రంలో వివిధ పట్టణంలో నగరం లో అత్యంత విలువైన స్థలాలు ఉన్నాయన్నారు...వీటిని వాణిజ్య పరంగా ఉపయోగించుకొని సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకోవలని ఆర్టీసీ నిర్ణయించిందని తెలిపారు...ఈ మేరకు సంస్థకు ఉన్న వివిధ స్థలాలను పెట్రోల్ బంకు లు ఏర్పాటు చేసుకోవడానికి పెట్రోలియం కార్పొరేషన్ ..ఇండియన్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే......దాదాపు 90 స్థలాల్లో పెట్రోల్ బంకులకు ఒప్పందం చేసుకుంది..
1 ఆర్టీసీ తో చేసుకున్న ఒప్పందాన్ని సమీక్షించాలి
2 సర్వీస్ ప్రొవైడర్ పెరు మీద ప్రైవేట్ సంస్థలకు..వ్యక్తులకు ఇచ్చిన డీలర్ శివ లను వెంటనే రద్దు చేయాలి..
3 ఇప్పటి వరకు వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీ ఖాతాలో జమ చేయాలి
4 పెట్రోల్ బంకు లు ఔట్ సోర్స్ చేసే అవకాశం లేకుండా ఆర్టీసీ సిబ్బంది నిర్వహించే విధంగా నిబండలను మార్చాలని అన్నారు..ఒక వైపు ఆర్.టి.సి కార్మికులు తమ వేతనాలు డిమాండ్స్ సాధన కొరకు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారని,మరోవైపు ఆర్.టి.సి ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం అక్రమం అని అన్నారు..
బైట్ : మల్లారెడ్డి ( బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు)Body:వంశీConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.