ETV Bharat / state

TSRTC Bus Tracking App : ఈ యాప్​ ఇన్​స్టాల్ చేసుకోండి.. మీ బస్ ఎక్కడుందో తెలుసుకోండి..!

author img

By

Published : May 12, 2023, 3:43 PM IST

TSRTC
TSRTC

TSRTC Bus Tracking App : ఆర్టీసీ బస్సు కోసం వేచిచూస్తున్నారా..? ఇకపై ఆ అవసరం లేదని టీఎస్​ఆర్టీసీ స్పష్టం చేస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బస్ ట్రాకింగ్ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్​తో బస్సు సమయ వేళలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. దీంతో పాటు ప్రయాణికులు తమ ఫీడ్ బ్యాక్​ను కూడా అందులో పొందుపరిచే అవకాశాన్ని కల్పించామని ఆర్టీసీ యాజమన్యం వెల్లడించింది. ఇంతకీ ఈ బస్ ట్రాకింగ్ యాప్ ఎలా పనిచేస్తుంది..? ఆ వివరాలు తెలుసుకుందాం.

TSRTC Bus Tracking App : టీఎస్​ఆర్టీసీలో సుమారు పదివేల ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. లక్షలాది మంది ప్రయాణికులను సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఆర్టీసీ అంటే ప్రయాణికులకు నమ్మకం ఉంది. కానీ.. బస్సులు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు వెలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై యాజమాన్యం సుదీర్ఘ కసరత్తే చేసింది. ప్రయాణికులకు మరింత చేరువచ్చేందుకు ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొద్దిరోజుల క్రితమే ఈ యాప్ అందుబాటులోకి వచ్చినప్పటికి.. దీనిని కొన్ని బస్సుల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. మొదట రిజర్వేషన్ బస్సులకు మాత్రమే యాప్​ను అనుసంధానం చేశారు. అనంతరం జిల్లాలకు వెళ్లే ఎక్స్​ప్రెస్, లగ్జరీ, రాజధాని తదితర బస్సుల్లోనూ వినియోగిస్తున్నారు. జిల్లాల్లో నడిచే 4,170 బస్సుల్లో ఈ యాప్​ను వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

టీఎస్ఆర్టీసీ వెహికల్ ట్రాకింగ్ యాప్ ​: ఎవరైనా ప్రయాణికుడు ఏదైనా స్టాపులో ఉన్న.. తాను వెళ్లాల్సిన బస్సు కోసం, ఆ మార్గంలో ప్రయాణించే బస్సుల జాడ గురించి ఈ యాప్ సహాయంతో తెలుసుకోవచ్చు. బస్సు నంబర్లతో సహా మొత్తం వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. మనం ఎక్కాల్సిన బస్సు ఎక్కడుంది..? ఎంతసేపట్లో మనం ఉన్న స్టేజి వద్దకు వస్తుందన్న వివరాలు ఇందులో ప్రత్యక్షమవుతాయి.

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న టీఎస్ఆర్టీసీ వెహికల్ ట్రాకింగ్ యాప్​ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా.. బస్సుల సమాచారాన్ని పొందొచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. లేదా సిటీ బస్సులో డ్రైవర్ సీటు వెనుక కానీ.. కండక్టర్ వద్ద పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసి కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని మెట్రో ఎక్స్​ప్రెస్ బస్సుల్లోనూ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు.. గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని మెట్రో ఎక్స్​ప్రెస్ బస్సుల్లోనూ : గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 2,850 సిటీ బస్సులు తిరుగుతుండగా.. అందులో 1,100 మెట్రో బస్సులకు అనుసంధానం చేశామని యాదగిరి చెప్పారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని వివరించారు. మెట్రో, ఎంఎంటీఎస్, రైళ్లలో ప్రయాణిస్తూ కూడా టీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చని యాదగిరి వెల్లడించారు.

ఇవీ చదవండి: TSRTC: ఊరూరా.. వాడవాడనా బస్​ ఆఫీసర్లు.. మరో వినూత్న కార్యక్రమానికి ​శ్రీకారం

Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో నంబర్ వన్ 'శంషాబాద్ ఎయిర్​పోర్టు'

రాహుల్​ కేసులో తీర్పునిచ్చిన జడ్జి ప్రమోషన్​పై సుప్రీం స్టే.. మరో 68 మందిపై కూడా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.