ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజ్‌ కేసు.. నిందితులకు 6 రోజుల కస్టడీ

author img

By

Published : Mar 17, 2023, 5:10 PM IST

Updated : Mar 17, 2023, 6:17 PM IST

tspsc
tspsc

ప్రశ్నపత్రం లీకేజ్‌ కేసు నిందితులను పోలీసులు రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు. నిందితులను 6 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే చంచల్‌గూడ జైలులో ఉన్న వారిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు.

టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిందితులను 6 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులను రేపటి నుంచి ఈనెల 23 వరకు పోలీసు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం వారు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఇందులో భాగంగానే రేపు 9 మందిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. వారి నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. లీకేజీతో ఇంకెంత మందికి సంబంధముందో అనే అంశాన్ని పోలీసులు తేల్చనున్నారు.

మరోవైపు ఫిబ్రవరి 27న కాన్ఫిడెన్షియల్ సెక్షన్​కు చెందిన కంప్యూటర్‌లోకి చొరబడిన ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి.. అందులోని పరీక్షా పత్రాలను పెన్​డ్రైవ్​లోకి కాపీ చేసుకున్నారు. కంప్యూటర్ల నుంచి కాపీ చేసిన సమాచారాన్ని రాజశేఖర్‌రెడ్డి ప్రవీణ్‌కు ఇచ్చాడు. వాటిని 4 పెన్‌డ్రైవ్‌లలో ప్రవీణ్ కాపీ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వారు ప్రశ్నపత్రాలతో పాటు కంప్యూటర్‌లోని మొత్తం సమాచారాన్ని కాపీ చేశారు. గతనెల 28న ఏఈ ప్రశ్నపత్రం ప్రింట్‌ను ప్రవీణ్‌ రేణుకకు అందించారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ , ఏఈఈ, డీఏఓ పరీక్షలు రద్దు: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. సిట్‌ నివేదిక, అంతర్గత విచారణను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ , ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏఈఈ, డీఏవో పరీక్షల తేదీలు త్వరలో వెల్లడిస్తామని వివరించింది. ఇందులో భాగంగానే జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్ నిర్వహించనట్లు పేర్కొంది.

కమిషన్‌ తీరును తప్పుపడుతూ వివిధ రూపాల్లో నిరసనలు: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విపక్ష నేతలు కమిషన్‌ తీరును తప్పుపడుతూ వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద నిరసన దీక్షకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దిగారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. ఘటనకు నైతిక బాధ్యతగా మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు పేపర్‌ లీకేజీపై యువజన కాంగ్రెస్‌ నాయకులు గాంధీభవన్‌ నుంచి టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపించాలని వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ కుటుంబానికి పేపర్‌ లీకేజీతో సంబంధం ఉందంటూ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ట్విటర్ వేదికగా ఆక్షేపించారు.

ఇవీ చదవండి: TSPSC పేపర్ లీకేజ్.... గ్రూప్‌-1 ప్రిలిమ్స్ సహా ఆ పరీక్షలు రద్దు

TSPSC పేపర్‌ లీక్ కేసు సిట్‌కు బదిలీ.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

'నెహ్రూ' ఇంటి పేరుపై రగడ.. మోదీకి కాంగ్రెస్​ ప్రివిలేజ్​ నోటీసులు

Last Updated :Mar 17, 2023, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.