TS Constable Exam Preliminary Key : పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ 'కీ' విడుదల
Published: May 21, 2023, 7:45 PM


TS Constable Exam Preliminary Key : పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ 'కీ' విడుదల
Published: May 21, 2023, 7:45 PM
TS Constable Exam Preliminary Key : పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ 'కీ'ని రాష్ట్ర పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. 'కీ'లో ఏమైనా అభ్యంతరాలుంటే 24 మే సాయంత్రం 5 గంటలలోపు.. నిర్దేశిత ప్రొఫార్మా ప్రకారం వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించింది.
TS Constable Exam Preliminary Key : పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ 'కీ'ని పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. కానిస్టేబుల్ సివిల్, పీసీ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఐటీ తత్సమాన పోస్టులకు నిర్వహించిన తుది పరీక్ష ప్రిలిమినరీ 'కీ' ప్రస్తుతం www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యంతరాలను 24 మే సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం నమోదు చేయాలని.. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలని తెలిపింది. అభ్యర్థన అసంపూర్తిగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేసింది.
TS Constable Final Exams Competition Information : తెలంగాణ పోలీస్ నియామక మండలి నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఏప్రిల్ 30న జరిగింది. తుది పరీక్షల్లో.. లక్షా 9 వేల 663 మంది సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గానూ.. లక్షా 8 వేల 55 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థుల్లో 6 వేల 801 మందికి గానూ 6 వేల 88 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 98.53 శాతం, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 89.52 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఏ విభాగాలకు ఎంత మంది..: టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టుల కోసం తుది రాత పరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. ఈ క్రమంలో ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీ నెలకొంది. అయితే కీలకమైన సివిల్ విభాగంలోనే అధికంగా 15,644 పోస్టులున్నాయి. వీటి కోసం 90,488 మంది పోటీలో ఉన్నారు. ఈ లెక్కన ప్రతీ ఆరుగురిలో ఒకరికి కొలువు దక్కే అవకాశం ఉండటంతో అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగం కల ఊరించే అంశంగా మారింది. ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఒక్కో పోస్టుకు 25 మంది.. మెకానిక్ విభాగంలో 56 మంది.. డ్రైవర్ విభాగంలో 65 మంది.. రవాణా విభాగంలో 143 మంది.. ఎక్సైజ్‌శాఖలో 97 మంది.. అగ్నిమాపక శాఖ ఆపరేటర్ విభాగంలో 12 మంది పోటీలో ఉన్నారు.
ఇవీ చదవండి:
