ETV Bharat / state

TRT Notification Telangana 2023 : ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల.. 20 నుంచి దరఖాస్తులు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2023, 10:43 AM IST

TRT Notification Release
TRT Notification Release for Teachers Posts

TRT Notification Telangana 2023 : గత నెలలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవసరమైన టీఆర్​టీ నోటిఫికేషన్​ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 20 నుంచి అక్టోబరు 21వ తేదీ వరకు టీఆర్​టీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్​లైన్​ చేసుకోవచ్చు. అలాగే ఆన్​లైన్​ పరీక్ష కేంద్రాల వివరాలను కూడా రిలీజ్​ చేశారు.

TRT Notification Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు.. ఉపాధ్యాయ నియామక పరీక్ష(Teacher Recruitment Test) నోటిఫికేషన్​ విడుదల అయింది. ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు టీఆర్​టీ దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరు 20 నుంచి 30 వరకు ఆన్​లైన్​ చేసుకోవచ్చు. హైదరాబాద్​, రంగారెడ్డి, మెదక్​లో టీఆర్​టీ ఆన్​లైన్​ పరీక్ష కేంద్రాలు(TRT Online Exam Centers) ఏర్పాటు చేశారు. అలాగే సంగారెడ్డి, మహబూబ్​నగర్​, నల్గొండ.. నిజామాబాద్​, ఆదిలాబాద్​, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మంలో టీఆర్​టీ ఆన్​లైన్​ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Telangana Teacher Posts Notification : గత నెల 25న 5,089 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. 2,575 ఎస్​జీటీ, 1,739 స్కూల్​ అసిస్టెంట్​, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు తగిన సమాచారం వెబ్​సైట్​లో పాఠశాల విద్యాశాఖ పొందుపరిచింది.

How to Check India Post GDS Results 2023 : గ్రామీణ్​ డాక్​ సేవక్ పోస్టులకు ఎంపిక పూర్తి.. ఈ 30వేల మందికి ఉద్యోగాలు ఫిక్స్!

AIATSL Job News Today : పదో తరగతి అర్హతతో.. 998 హ్యాండీమ్యాన్​, ఏజెంట్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

టీఆర్​టీ నోటిఫికేషన్​ వివరాలు : టీఆర్​టీ నోటిఫికేషన్​కు సంబంధించి ఆన్​లైన్​ దరఖాస్తులు సెప్టెంబరు 20 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబరు 21వ తేదీని ఆఖరి తేదీ. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్​లైన్​లోనే చేయాలి. రాతపరీక్షను కంప్యూటర్​ బేస్ట్​ విధానంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పరీక్ష కేంద్రాల వివరాలను వెబ్​సైట్​లో పొందుపరిచారు. అఫ్లికేషన్​ ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ఇంకా పూర్తి సమాచారాన్ని దిగువన ఇవ్వడం జరిగింది.

1 దరఖాస్తులు ప్రారంభం సెప్టెంబరు 20
2 దరఖాస్తులు చివరి తేదీ అక్టోబరు 21
3 అర్హత బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులై ఉండాలి
4 దరఖాస్తు విధానం ఆన్‌లైన్‌
5 రాతపరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ విధానం
6 అప్లికేషన్‌ ఫీజు రూ.1000
7 ఆన్‌లైన్‌ రాత పరీక్ష నవంబరు 20 నుంచి 30 వరకు
8 వయసు 18 నుంచి 44 ఏండ్ల లోపు
9 వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.in
10 పరీక్షా కేంద్రాలు

హైదరాబాద్​, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్​నగర్​..

నల్గొండ, నిజామాబాద్​, ఆదిలాబాద్​, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం

TS Tet exam on 15th September : ఈనెల 15న టెట్​ పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పేపర్​-1 పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్​-2 పరీక్షను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన హాల్​ టికెట్లను సెప్టెంబరు 9 నుంచి విద్యాశాఖ వెబ్​సైట్​లో ఉంచనున్నారు.

Telangana Govt Approves 5089 Teacher Posts : డీఎస్సీ ద్వారా 5,089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

DSC Candidates Protest at Assembly in Telangana : మెగా నోటిఫికేషన్ కావాలంటూ అసెంబ్లీ ముందు​ డీఎస్సీ అభ్యర్థుల మహాధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.