ETV Bharat / bharat

AIATSL Job News Today : పదో తరగతి అర్హతతో.. 998 హ్యాండీమ్యాన్​, ఏజెంట్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 10:39 AM IST

Updated : Sep 5, 2023, 11:36 AM IST

AIATSL Job News Today In Telugu : ఎయిర్​ ఇండియా ఎయిర్​ ట్రాన్స్​పోర్ట్​ సర్వీసెస్​ లిమిటెడ్​ (AIASL) 998 హ్యాండీమ్యాన్​, యుటిలిటీ ఏజెంట్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

AIASL Recruitment 2023 For 900 Handyman and Utility Agent Posts
AIASL Job News Today

AIATSL Job News Today : పదో తరగతి చదువుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులందరికీ శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్​ ఇండియా ఆధ్వర్యంలోని.. 'ఎయిర్​ ఇండియా ఎయిర్ ట్రాన్స్​పోర్ట్​​ సర్వీసెస్​ లిమిటెడ్'​ (AIASL) 998 హ్యాండీమ్యాన్​, ఏజెంట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్​ 18లోపు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • హ్యాండీమ్యాన్​ - 971 పోస్టులు
  • యుటిలిటీ ఏజెంట్ (మేల్స్​) - 20 పోస్టులు
  • యుటిలిటీ ఏజెంట్​ (ఫిమేల్స్​) - 07 పోస్టులు

విద్యార్హతలు
AIATSL Jobs Qualifications :

  • హ్యాండీమ్యాన్​ పోస్టులు : అభ్యర్థులు ఎస్​ఎస్​సీ/10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అయితే కచ్చితంగా ఇంగ్లీష్​ చదవగలగాలి, అర్థం చేసుకోగలగాలి. హిందీ, స్థానిక భాషలు వచ్చినవారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • యుటిలిటీ ఏజెంట్​ పోస్టులు : అభ్యర్థులు 10వ తరగతి క్వాలిఫై అయ్యుండాలి. ఆంగ్లం అర్థం చేసుకోగలగాలి. హిందీ, అలాగే స్థానిక భాషలు తెలిసి ఉండాలి.

వయోపరిమితి
AIATSL Jobs Age Limit : హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్​​ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి.. జనరల్​ అభ్యర్థులకు 28 ఏళ్లు; ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు; ఎస్సీ/ఎస్టీలకు 33 ఏళ్లు ఉంటుంది.

ఎంపిక విధానం
AIATSL Selection Process : అభ్యర్థులకు పర్సనల్​/ వర్చువల్ స్క్రీనింగ్ టెస్ట్​ చేస్తారు. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ముంబయిలో పనిచేయాల్సి ఉంటుంది.

జీతభత్యాలు

  • AIATSL Handyman Salary : హ్యాండీమ్యాన్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,330 చొప్పున జీతం అందిస్తారు.
  • AIATSL Utility Agent Salary : యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు ఎంపికై అభ్యర్థులకు నెలకు రూ.21,330 చొప్పున జీతం ఇస్తారు.

దరఖాస్తు విధానం
AIATSL Application Process : ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫారమ్​తో సహా విద్యార్హతలకు సంబంధించిన పత్రాలను కింది చిరునామాకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

చిరునామా: HRD Department, AI Airport Services Limited, GSD Complex, Near Sahar Police Station, CSMI Airport, Terminal-2, Gate No-5, Sahar, Andheri-East, Mumbai-400099

దరఖాస్తుకు చివరి తేదీ :
AIATSL Job Application Last Date : 2023 సెప్టెంబర్​ 18

Last Updated :Sep 5, 2023, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.