ETV Bharat / state

టీఆర్టీ హిందీ స్కూల్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల

author img

By

Published : Oct 22, 2020, 10:26 PM IST

టీఆర్టీ హిందీ స్కూల్ అసిస్టెంట్, వైద్య విద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నియామక ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష.. టీఆర్టీలో భాగంగా 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 158 హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన టీఎస్​పీఎస్​సీ.. గురువారం 148 మందిని ఎంపిక చేసింది.

trt hindhi pandit result released by tspsc
టీఆర్టీ హిందీ స్కూల్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్టీ హిందీ స్కూల్ అసిస్టెంట్, వైద్య విద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నియామక ఫలితాలను ప్రకటించింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష.. టీఆర్టీలో భాగంగా 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 158 హిందీ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన టీఎస్​పీఎస్​సీ.. గురువారం 148 మందిని ఎంపిక చేసింది.

అర్హులు లేకపోవడం, కోర్టు కేసుల వంటి కారణంగా మరో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయని టీఎస్​పీఎస్​సీ అదనపు కార్యదర్శి సుమతి తెలిపారు. వైద్య విద్య విభాగంలో 167 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలను ప్రకటించింది.

అనస్థిషియాలజీ, ఓబీజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్​టీ, సైకియాట్రీ, నెఫ్రాలజీ విభాగాల్లో 107 మందిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. అర్హులు లేకపోవడం వల్ల మరో 59 పోస్టులు ఖాళీగా ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.

ఇదీ చదవండి: కేటీఆర్​ను కలిసిన హీరో రామ్ .. రూ.25 లక్షల విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.