ETV Bharat / state

RAKSHA BANDHAN: మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన పలువురు మహిళా నేతలు

author img

By

Published : Aug 22, 2021, 3:29 PM IST

రక్షా బంధన్​ వేడుకల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. పలువురు తెరాస మహిళా నేతలు ప్రగతి భవన్​కు చేరుకుని కేటీఆర్​కు రాఖీ కట్టారు.

rakhi
రాఖీ

రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్​కు పలువురు మహిళా నేతలు రాఖీ కట్టారు. వారితో కలిసి ప్రగతి భవన్​లో కేటీఆర్​ రక్షా బంధన్​ వేడుకలు జరుపుకున్నారు. మంత్రి సత్యవతి రాఠోడ్​, ప్రభుత్వ విప్​, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్​ రెడ్డి, జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయలక్ష్మి, వరంగల్​ మేయర్​ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ ఛైర్​ పర్సన్​ జ్యోతి, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు కేటీఆర్​కు​ రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.

  • రాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారికి రాఖీ కట్టిన మంత్రి శ్రీమతి @SatyavathiTRS, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS, హైదరాబాద్ మేయర్ శ్రీమతి @GadwalvijayaTRS, వరంగల్ మేయర్ శ్రీమతి @SudhaRani_Gundu...

    1/2 pic.twitter.com/hcn2v0u0cM

    — TRS Party (@trspartyonline) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆడపడుచులందరికీ కేటీఆర్​ ధన్యవాదాలు తెలిపారు. సోదరసోదరీమణులకు రక్షాబంధన్​ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదీ చదవండి: RAKHI POURNAMI: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.