ETV Bharat / state

ఉప్పల్ వేదికగా నేడు IPL మ్యాచ్.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

author img

By

Published : Apr 9, 2023, 8:19 AM IST

IPL Match
IPL Match

IPL Match in Hyderabad Today : నేడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్​తో హోం టీం సన్​రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో వేళలు పొడిగించారు.

IPL Match in Hyderabad Today : వేసవి వినోదాన్ని పంచుతూ క్రికెట్ ఫ్యాన్స్​ను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ మ్యాచ్​కు నేడు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం మరోసారి వేదిక కానుంది. ఇప్పటికే ఏప్రిల్ 2న ఇదే స్టేడియంలో సన్​రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. అదే.. ఇక మన భాగ్యనగరంలోనే మ్యాచ్ జరుగుతుందంటే క్రికెట్ ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో ఇవాళ నగరంలో మరో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు : ఇవాళ ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే మ్యాచ్.. రాత్రి 11.30 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్​తో పాటు వరంగల్ రహదారిపై కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ మళ్లించనున్నారు. ప్రధానంగా వరంగల్ రహదారిపై వచ్చే వాహనాలను చెంగిచెర్ల చౌరస్తా నుంచి చర్లపల్లి ఎన్‌ఎఫ్‌సీ వైపు మళ్లిస్తారు.

ఇవాళ అటు వైపు వెళ్లకండి : అలాగే ఎల్బీనగర్‌ నుంచి వచ్చే వాహనాలను హెచ్‌ఎండీఏ లే అవుట్ బోడుప్పల్‌, చెంగిచెర్ల చౌరస్తా వైపు, మల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలను నాచారం ఐడీఏ మీదుగా చర్లపల్లి వైపు మళ్లించనున్నారు. ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపలికి వచ్చే వారు తమ వెంట ఎటువంటి వస్తువులు తీసుకురావొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాత స్టేడియంలోనికి అనుమతించనున్నారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు అందిస్తామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.

స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న సీపీ.. పార్కింగ్ కోసం గతంలో మాదిరిగానే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. బ్లాక్ టికెట్ల విక్రయాన్ని అరికట్టేందుకు స్టేడియ పరిసరాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతారన్నారు. అదేవిధంగా ఎవరైనా బ్లాక్​లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ చౌహాన్ హెచ్చరించారు. టికెట్ల పంపిణీ అంతా పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్న ఆయన.. ప్రేక్షకులు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. అదే విధంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో సమయ వేళలు పొడిగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.