'అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!'

author img

By

Published : May 23, 2022, 3:56 PM IST

Reventh Reddy

Reventh Reddy Tweet: టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంజాబ్​ రైతులకు సీఎం కేసీఆర్​ ఆర్థికసాయం అందజేయడంపై రేవంత్​ మండిపడ్డారు. తెలంగాణ రైతులను కనీసం పలకరించని కేసీఆర్​... పంజాబ్​ రైతులకు సాయం చేయడం పట్ల మర్మమేమిటోనని అనుమానం వ్యక్తం చేశారు.

Reventh Reddy Tweet: అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమోనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఉద్దేశిస్తూ చురకలంటించారు. తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్... పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారని ట్విటర్‌ వేదికగా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా... అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

  • ఐనవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!
    తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఫాంహౌస్ గడప దాటి…ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్ పంజాబ్ రైతులకు పరిహారం ఇచ్చారు.
    మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!#kcrfailedtelangana pic.twitter.com/XXoySErZsc

    — Revanth Reddy (@revanth_anumula) May 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చండీగఢ్​లో సీఎం చెక్కుల పంపిణీ: ఉత్తరాది పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్... ఆదివారం చండీగఢ్​లో పర్యటించారు. రైతులు, జవాన్ల కుటుంబాలను సీఎం కేసీఆర్‌, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సానుభూతి ప్రకటించారు. చండీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఇరువురు ముఖ్యమంత్రులు వెళ్లి పలకరించారు. రైతు ఉద్యమంలో అమరులైన అన్నదాతలకు నివాళులర్పించారు. అనంతరం ఠాగూర్ స్టేడియంలో రైతుల కుటుంబాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం తర్వాత గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు, అమరులైన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. దిల్లీ, పంజాబ్‌ సీఎంల సమక్షంలో 600 కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.