ETV Bharat / state

Three Died in Hyderabad Ganesh Nimajjanam : గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 1:08 PM IST

Three Childrens Died
Three Childrens Died on the Day of Ganesh Immersion

Three Died in Hyderabad Ganesh Nimajjanam : హైదరాబాద్​లో గణేశ్ నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. ఈ ఉత్సవాల్లో పలుచోట్ల అపశ్రుతి జరిగింది. గణపతి నిమజ్జన ఉత్సవాల్లో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు చిన్నారు మరణించారు.

Three Died in Hyderabad Ganesh Nimajjanam : హైదరాబాద్​లో జరుగుతున్న గణేశ్​ నిమజ్జన వేడుక(Ganesh Immersion 2023)ల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సంజీవయ్య పార్క్​ వద్ద ప్రమాదవశాత్తు వాహనం కిందపడి బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు కిషన్​బాగ్​ చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.

Hyderabad Ganesh Nimajjanam Accidents : అలాగే బషీర్​బాగ్​ ఫ్లైఓవర్​ వద్ద వాహనం కిందపడి నాలుగేళ్ల బాలుడు మరణించాడు. బెల్లంపల్లికి చెందిన రాజశేఖర్​ కుటుంబం నగరంలోని సంతోశ్​ నగర్​ ప్రెస్​ కాలనీలో నివాసం ఉంటుంది. గణేశ్​ నిమజ్జనం కోసం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. బషీర్​బాగ్​ వద్ద బైకు అదుపు తప్పడంతో వారంతా కిందపడ్డారు. నాలుగేళ్ల బాలుడి పైనుంచి మరో వాహనం వెళ్లింది. తీవ్రగాయాలైన బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

Hyderabad Ganesh Tragedy : మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కూడా వినాయక నిమజ్జన వేడుక(Ganesh Visarjan Tragedy Telangana)ల్లో అపశ్రుతి జరిగింది. ట్రాక్టర్​ కిందపడి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో జరిగింది. మృతునిది చెర్లపటేల్​గూడ గ్రామంగా గుర్తించారు. మహబూబాబాద్​లో గురువారం వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనంలో విద్యుదాఘాతంతో యువకుడు మహేశ్​ మృతి చెందాడు. అలాగే జగిత్యాల జిల్లాలో గణేశ్​ శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. యువకుడిపై కత్తితో దాడి చేసిన వ్యక్తులు.. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. 11 మంది మృతి

Ganesh Nimajjanam Continuing on Second Day : మరోవైపు.. భాగ్యనగరంలో గురువారం ప్రారంభమైన గణేశుడి శోభాయాత్ర ఇంకా కొనసాగుతోంది. ట్యాంక్​బండ్​ వద్ద గల హుస్సేన్​సాగర్​ పరిసర ప్రాంతాల్లో గణేశ్​ శోభాయాత్ర రమణీయంగా సాగుతోంది. గణనాథుల నిమజ్జనంతో కోలాహలంగా హుస్సేన్​సాగర్​ పరిసరాలు మారాయి. బషీర్​బాగ్​, అబిడ్స్​, లక్డీకాపూల్​ నుంచి ట్యాంక్​బండ్​కు విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఈ గణేశ్​ నిమజ్జనాలు మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉందని భద్రతా సిబ్బంది తెలిపారు.

అబిడ్స్​లో చర్మాస్​ వద్ద పాతబస్తీ నుంచి వినాయక విగ్రహాన్ని తీసుకువస్తున్న టస్కర్​ వాహనం ఆగిపోయింది. దీంతో ట్రాఫిక్​ పోలీసులు జేసీబీ సహాయంతో ఆ వాహనాన్ని ముందుకు తరలించారు. ఇప్పటికే 7,174 గణేశ్​ విగ్రహాలు గంగమ్మ ఒడిలోకి చేరుకున్నాయని జీహెచ్​ఎంసీ తెలిపింది. బషీర్​బాగ్​, లిబర్టీ, నారాయణగూడలోని రహదారుల మీదగా శోభాయాత్ర కొనసాగుతుంది. దీంతో సాధారణ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ట్రాఫిక్​ ఆంక్షలు : హైదరాబాద్​లోని పలుచోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు కొనసాగుతున్నాయి. లక్డీకాపూల్​, టెలిఫోన్​ భవన్​ మార్గాల్లో శోభాయాత్ర కొనసాగుతుంది. అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్​ మార్గంలో కూడా శోభాయాత్ర కొనసాగుతుండడంతో కూకట్​పల్లి, ఎర్రగడ్డ మీదగా వచ్చే వాహనాలు అమీర్​పేట్​ వైపు మళ్లించనున్నారు.

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి

గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.