ETV Bharat / state

TRS mlc nominations: ఆరుగురు తెరాస అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే..

author img

By

Published : Nov 17, 2021, 3:29 PM IST

Updated : Nov 17, 2021, 7:31 PM IST

mlc nominations
mlc nominations

శాసనసభ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన ( mlc nominations)ప్రక్రియ పూర్తైంది. తెరాస అభ్యర్థులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, రవీందర్ రావు పరిశీలనకు హాజరయ్యారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామపత్రాల పరిశీలన ప్రకియ పూర్తయింది (mlc nominations verification completed). ఎన్నికల సంఘం పరిశీలకులు, ఐఏఎస్ అధికారి మహేశ్​దత్ ఎక్కా సమక్షంలో పరిశీలన పూర్తిచేశారు. తెరాస అభ్యర్థులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి (kadiyam srihari), బండ ప్రకాష్ (banda prakash), రవీందర్ రావు పరిశీలనకు హాజరయ్యారు. వెంకట్రామిరెడ్డి తరఫున ఎన్నికల ఏజెంట్ రమేష్ రెడ్డి హాజరయ్యారు.

ఆ ఇద్దరివి తిరస్కరణ

శ్రమజీవి పార్టీ (shramajeevi party) తరఫున నామినేషన్లు దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు జాజుల భాస్కర్, బోజరాజు కోయల్కర్ కూడా పరిశీలనకు హాజరయ్యారు. ఎనిమిది మంది దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలకుని సమక్షంలో రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. ప్రతిపాదించిన వారి సంతకాలు లేకపోవడంతో ఇద్దరు శ్రమజీవి పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు.

ఇక లాంఛనమే..

ఆరుగురు తెరాస అభ్యర్థుల నామినేషన్లు సక్రమమని తేల్చారు. ఆరు స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆరుస్థానాలకు ఆరుగురే పోటీలో ఉన్న నేపథ్యంలో ఉపసంహరణ గడువు ముగిశాక ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. దీంతో శాసనసభ కోటా ఎమ్మెల్సీలుగా ఆరుగురి ప్రకటన ఇక లాంఛనం కానుంది.

వ్యూహాత్మకంగా ఎంపిక

అత్యంత వ్యూహాత్మకంగా.. పార్టీ సమీకరణాలకు అనుగుణంగా అభ్యర్థుల (TRS Candidates For MLC) ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్‌ నేతలైన కడియం, గుత్తాల ప్రాధాన్యం దృష్ట్యా వారికి అవకాశం ఇచ్చారు. పార్టీ సేవలకు గుర్తింపుగా తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఎంపిక చేశారు. తనకు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామరెడ్డితో పాటు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు పార్టీ నేత కౌశిక్‌రెడ్డి పేర్లను జాబితాలో చేర్చారు. మండలిలో బలమైన బీసీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం కోసం రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యునిగా 2024 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉన్నా.. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేయడం గమనార్హం. విషయాన్ని వారికి కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ ద్వారా తెలిపారు. వెంటనే వారు ప్రగతిభవన్‌కు చేరుకోగా పార్టీ అభ్యర్థులు (TRS Candidates For MLC) గా బి-ఫారాలు అందజేశారు.

నామినేషన్ల దాఖలు

ఒక్కో సభ్యుడిని పదిమంది ఎమ్మెల్యేలు బలపరిచారు. పత్రాలను బుధవారం ఇవాళ పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 22 వరకు గడువు ఉంది. ఏకగ్రీవమవుతున్నందున అభ్యర్థులు గెలిచినట్లు అధికారులు అదేరోజు ప్రకటించి ధ్రువీకరణపత్రాలను జారీ చేయనున్నారు. షెడ్యూలు మేరకు 29న ఎన్నికలు (MLC Election 2021) జరగాల్సిన విషయం విదితమే.

గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాపై త్వరలో నిర్ణయం

గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఖాళీగా ఉన్న ఒక స్థానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ తెరాస శాసనసభా పక్ష సమావేశంలో మంత్రులు, నేతలకు తెలిపారు. కాగా... ఈ స్థానం కోసం మాజీ సభాపతి మధుసూదనాచారి, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌ తదితరుల పేర్లను సీఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి: MLC Elections 2021: మండలి స్థానాలకు నామినేషన్లు.. ఆరూ తెరాసకే!!

Last Updated :Nov 17, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.