ETV Bharat / state

కరోనాను జయించిన శతాధిక వృద్ధుడు

author img

By

Published : May 22, 2021, 10:48 PM IST

కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. మహమ్మారి ధాటికి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికే వణికిపోతున్నారు. అయితే 102 ఏళ్ల వృద్ధుడు కొవిడ్​ను జయించి అందరిని ఆశ్చర్యపరిచాడు. వైద్యుల సూచనలు పాటించి మహమ్మారి బారి నుంచి బయటపడ్డాడు. ఇంతకీ ఎవరా వృద్ధుడు.. ఈ సంఘనట ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.

old man conquered Corona in jagtial district
కరోనాను జయించిన వృద్దుడు

జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రానికి చెందిన మహ్మద్ జైనుద్దీన్ అనే 102 ఏళ్ల వృద్దుడు కరోనాను జయించి అందరిని ఆశ్చర్యపరిచాడు. కొవిడ్ సోకిందని కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు. వైద్యులు సూచనలు పాటించి, మనోధైర్యంతో మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చని నిరూపించారు.

మహ్మద్‌ జైనుద్దీన్‌ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే ఏమాత్రం భయపడకుండా వైద్యుల సలహా తూచా తప్పకుండా పాటించి కొవిడ్ నుంచి బయటపడ్డారు. 102 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా, ఉత్సాహం ఉన్నాడు. జైనుద్దిన్ గతంలో రాయికల్ గ్రామానికి రెండుసార్లు సర్పంచిగా, ఒక సారి ఉపసర్పంచిగా పని చేశారు.

ఇదీ చదవండి: '50 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.