ETV Bharat / state

Justice N. V. Ramana : 'ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక'

author img

By

Published : Dec 4, 2021, 11:11 AM IST

Updated : Dec 4, 2021, 1:15 PM IST

Justice N. V. Ramana : కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. కోర్టులకు వచ్చేముందే తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చని సూచించారు. నేడు హైదరాబాద్​లో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు.

iamc conference 2021, HICC
హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం సదస్సు ప్రారంభం

Justice N. V. Ramana : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక అని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారానే కేసుల పరిష్కారం మేలని పేర్కొన్నారు. కోర్టులకు వచ్చేముందే తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చునని సూచించారు. ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని... మహిళలు సాధ్యమైనంతవరకు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని చెప్పారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని వెల్లడించారు. హైదరాబాద్​లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం... ఐఏఎంసీ నేటి సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఐఏఎంసీ ప్రారంభం కానున్నట్లు సీజేఐ వెల్లడించారు.

హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం సదస్సు

చివరి ప్రయత్నంగా కోర్టుకు రావాలి..

IAMC conference 2021 : కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పెండింగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలని చెప్పారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తీసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని... . అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.

"ప్రపంచంలో ఏదేశానికి వెళ్లినా కూడా.. మొదటగా అడిగే ప్రశ్న ఏంటంటే.. మీ దేశంలో పెట్టుబడులు పెట్టమని అడుగుతున్నారు. ఏదైనా లిటిగేషన్ వస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడుగుతున్నారు. అది వాస్తవం. అందుకే ఆర్థిక సంస్కరణలతో పాటు చట్టాల్లో సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. తెలుగు వారు ఈ రంగంలో ముందంజలో ఉన్నారు. ఈ దేశంలో న్యాయం చేయడానికి కోర్టులే కాదు ప్రభుత్వాలు, అధికారులు కూడా న్యాయం చేయవచ్చు. అంతేకాదు సమాజంలో గుర్తింపు ఉండి.. గౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తీర్పు చెప్పడానికి అర్హుడే. దానికి లా డిగ్రీలు అవసరం లేదు. ఈ మీడియేషన్ సెంటర్ ఒక్క ఇండస్ట్రీయలిస్టులకే కాదు... సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కుటుంబ సమస్యలు, వాణిజ్య సమస్యలు అన్నింటికి పరిష్కారం చేయవచ్చు. ఈ సెంటర్ కోసం భూమి కేటాయించినందుకు సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు."

-ఎన్.వి. రమణ, సీజేఐ

ఐఏఎంసీ సన్నాహక సదస్సు

Hyderabad IAMC conference : హైదరాబాద్​లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం... ఐఏఎంసీ సన్నాహక సదస్సు నేడు ప్రారంభమైంది. హెచ్ఐసీసీలో జరుగుతున్న సదస్సు ప్రారంభోత్సవానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. 20 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌కు భూమి కేటాయించారని ఆయన తెలిపారు. భూమి కేటాయించినా ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌ కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి:

Last Updated : Dec 4, 2021, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.