ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @11AM

author img

By

Published : Dec 24, 2022, 10:57 AM IST

Telangana Top News
Telangana Top News

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ‘పాలమూరు’ ఎన్జీటీ తీర్పుపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టులకు సంబంధించి ఎన్​జీటీ భారీ జరిమాన విధించిన నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇంజినీర్లతో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమావేశమయ్యారు.

  • సిరిసిల్ల జిల్లాలో సెస్‌ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెస్‌ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు, 75 మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు. ఇందుకోసం 202 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

  • విధులకు వెళ్తున్న కార్మికులను ఢీకొన్న కారు..

మెదక్​ పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధులకు హాజరవుతున్న పారిశుద్ధ్య కార్మికులపై కారు దూసుకుపోవడంతో అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

  • నేడు ఆర్టీసీ నూతన సూపర్‌ లగ్జరీ బస్సుల ప్రారంభం

టీఎస్​ఆర్టీసీలో కొత్త బస్సులు వస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతో కూడిన సరికొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌.. ఇవాళ సుమారు 50 బస్సులను ప్రారంభించనున్నారు.

  • దున్నపోతు మేడెక్కింది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఆకలి వేస్తే ఆ సమయంలో మన చుట్టు పక్కల తినడానికి ఏమి ఉందా అని వెతుకొంటాం. మనుషులే కాదు జంతువులు కూడా అదే పరిస్థితి. నిర్మల్​ జిల్లాలో దున్నపోతు ఆకలికి ఆగలేక మేడపైన తినడానికి ఏదైనా ఉండవచ్చోమో అని మేడేక్కింది. అయితే ఇంతకి దున్నపోతుకి ఆహారం దొరికింది? ఆకలి తీర్చుకుందా? తిరిగి కిందకి రాడానికి ఏలా కష్టపడింది?

  • 'భాష పరిరక్షణకు తమిళులను స్ఫూర్తిగా తీసుకోవాలి'

భాష, సంస్కృతి, ఆహార వ్యవహారాల పరిరక్షణ విషయంలో.. తమిళుల నుంచి తెలుగువారు నేర్చుకోవాల్సింది, స్ఫూర్తి పొందాల్సింది ఎంతో ఉందని.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు భాషకు పట్టిన ఆంగ్ల జ్వరాన్ని.. పద్యమనే ఆయుధంతో విడిపించాలని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు సూచించారు.

  • దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. జపాన్​లో లక్షకుపైగా..

దేశంలో కొత్తగా 201 మందికి కొవిడ్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజే 183 మంది కోలుకున్నట్లు తెలిపింది.

  • రెండున్నర గంటల ఛార్జింగ్‌ చేస్తే చాలు.. 500 కి.మీ దూరం ప్రయాణం!

ఒకసారి ఛార్జింగ్‌తో 500 కి.మీ వెళ్లే అధునాతన ఏసీ విద్యుత్తు బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ అభివృద్ధి చేసింది. తొలితరం విద్యుత్​ బస్సులు అయితే.. దాదాపుగా 3-4 గంటలు ఛార్జింగ్​ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించేవి. కానీ సాంకేతికత వృద్ధి చెందడం వల్ల రెండున్నర గంటలు ఛార్జింగ్​ చేస్తే చాలు.

  • అది అయ్యర్​ అంటే భలే సమాధానమిచ్చాడుగా!

భారత యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ షార్ట్ పిచ్​ బంతులు ఎదుర్కోలేడనే విషయం తెలిసిందే. దీనిపై ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా దీనిపై అతడు మాట్లాడాడు. ఆ విమర్శలను పట్టించుకోకుండా తప్పులు దిద్దుకోవడంపైనే దృష్టి పెట్టి విజయవంతం అయ్యానని అన్నాడు.

  • కైకాలను కడసారి చూసేందుకు తరలివస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు..

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు తుది నివాళులు అర్పించేందుకు ఫిలింనగర్‌లోని ఆయన నివాసానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.