ETV Bharat / state

కర్ణాటక ప్రచారంలో తెలంగాణ స్టార్‌ క్యాంపెయినర్లు

author img

By

Published : Apr 19, 2023, 10:40 PM IST

Star Campaigners in Karnataka Election: కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించింది. వీరిలో రాష్ట్రం నుంచి రేవంత్‌రెడ్డి, అజారుద్దీన్​కు చోటు కల్పించింది. మరోవైపు తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను తెలంగాణ నుంచి కర్ణాటకలో స్టార్​ క్యాంపెయినర్​గా బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది.

Karnataka Elections 2023
Karnataka Elections 2023

Star Campaigners in Karnataka Election: కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్, బీజేపీ ప్రకటించాయి. కాంగ్రెస్ తరఫున రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌లు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లుగా నియమితులయ్యారు.

40మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానం.. 40మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఇవాళ విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి సీనియర్లకు ఈ జాబితాలో స్థానం కల్పించింది. అందులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య ఉన్నారు. రణదీప్​ సింగ్‌ సుర్జేవాలా, జైరాం రమేశ్​, వీరప్ప మొయిలీ, ఎంపీ సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌, అశోక్‌ గెహ్లాట్‌, భూపేష్​ భగేల్, చిదంబరం, రేవంత్​రెడ్డి, మహ్మద్‌ అజారుద్దీన్‌లతోపాటు 40 మంది పేర్లను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ముఖుల్‌ వాస్కీ ఎన్నికల సంఘానికి జాబితా పంపారు.

20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా: ఈ క్రమంలోనే స్టార్ క్యాంపెయినర్​గా తెలంగాణ నుంచి డీకే అరుణను బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది. మరోవైపు కొద్ది రోజుల క్రితమే కర్ణాటక ఎన్నికల ప్రచారానికి అధిష్ఠానం తెలంగాణ బీజేపీ నేతలకు స్థానం కల్పించింది. ఈక్రమంలోనే మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి నాయకులను ఎంపిక చేసింది. అందులో 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా రాష్ట్ర నేతలను నియమించింది.

ఇప్పటికే తమకు అప్పగించిన నియోజకవర్గాలకు తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్‌, అర్వింద్‌, జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్‌ కుమార్‌ వెళ్లి ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు అప్పగించింది. 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌ఛార్జ్‌లుగా బీజేపీ అధిష్ఠానం నియమించింది.

ఇవీ చదవండి: BJP meeting: 'ప్రధాని కావాలని పగటి కలలు కంటూ కేసీఆర్‌ విఫల యాత్రలు చేస్తున్నారు'

BRS&BJP Clash: రసాభాసగా మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం.. ప్రొటోకాల్‌పై వివాదం

కొంపముంచిన 'కొత్త' వ్యూహం.. బీజేపీకి వరుస షాక్​లు.. రెబల్స్​గా మారి..

KGF బాబు ఇంటిపై ఐటీ దాడులు.. బీజేపీ రెబల్​ నివాసంలోనూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.