ETV Bharat / state

దళిత బంధుపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ

author img

By

Published : Aug 2, 2021, 4:14 PM IST

telangana high court
telangana high court

దళిత బంధుపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో 'దళిత బంధు' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడాన్ని సవాల్ చేస్తూ జనవాహిని, జై స్వరాజ్​, తెలంగాణ రిపబ్లికన్ పార్టీలు సహా మరో వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.

దళిత బంధు పథకంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిల్​ విచారణ జాబితాలోకి వచ్చినప్పుడే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలో 'దళిత బంధు' పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడాన్ని సవాల్ చేస్తూ జనవాహిని, జై స్వరాజ్​, తెలంగాణ రిపబ్లికన్ పార్టీలు సహా మరో వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై ఇవాళే అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది రాజు కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్​రెడ్డి ధర్మాసనం నిరాకరించింది.

ఇవీచూడండి:

CM KCR Speech: 'కేసీఆర్ ఏదనుకుంటే అది కావాల్సిందే.. ఎలా ఆపుతారో నేనూ చూస్తా..'

CM KCR: 'ఆర్థికంగా పటిష్ఠమైన రోజే ఎస్సీలు వివక్ష నుంచి దూరం అవుతారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.