ETV Bharat / state

వెన్నుచూపని వీరుడు, జనాదరణ పొందిన నాయకుడు - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 1:40 PM IST

Updated : Dec 7, 2023, 3:07 PM IST

Telangana CM Revanth Reddy Political Journey : రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో సంచలనం. భవిష్యత్ నాయకులకు మార్గదర్శకం. ఆటుపోట్లకు అదరలేదు. వైఫల్యాలకు కుంగలేదు. వెన్నుచూపని వీరత్వంతో అపజయాలనే అనుభవాలుగా, పోరాటాలనే వారధిగా చేసుకొని అనతికాలంలో అశేష జనాదరణ పొందాడు. స్థానికసంస్థల ప్రజాప్రతినిధిగా ప్రస్థానం మొదలుపెట్టి 15 ఏళ్లలోనే రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగి తాను రవ్వంత కాదు రాష్ట్రమంతా అని నిరూపించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం.

Revanth Reddy Political Career
Telangana CM Revanth Reddy Political Journey

మాటల తూటాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ధీరత్వం

గుక్క తిప్పుకోని ప్రసంగాలతో మంత్రముగ్దుల్ని చేసే చాతుర్యం

ఆవేశపూరిత వాగ్బాణాలతో యువతను ఉర్రూతలూగించగలిగే నాయకత్వం

ఆటుపోట్లకు వెన్నుచూపకుండా ఎదురొడ్డి నిలిచిన వీరత్వం

పార్టీలో చేరి పదేళ్లు కాకున్నా కాకలు తీరిన నేతలతో సాధ్యపడని లక్ష్యాన్ని ముద్దాడి శతాధిక పార్టీని అధికారంలోకి తెచ్చిన నేత

అలుపెరగని పోరాటంతో అనధి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జననేత ఎనుముల రేవంత్ రెడ్డి.

Telangana CM Revanth Reddy Political Journey : రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్‌ రెడ్డి నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు 1969 నవంబరు 8న జన్మించారు. రేవంత్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి అప్పట్లో గ్రామానికి పోలీస్‌ పటేల్‌గా వ్యవహరించేవారు. తల్లి రామచంద్రమ్మ గృహిణి. వీరిది వ్యవసాయ కుటుంబం.

రేవంత్‌ హైస్కూల్‌ విద్య వనపర్తిలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో కొనసాగింది. 1983-1985లో వనపర్తిలోనే ఇంటర్‌ బైపీసీ చదువుకున్నారు. హైదరాబాద్ ఏవీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి తమ్ముడు పద్మనాభరెడ్డి కుమార్తె గీతను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి కుమార్తె నైమిషారెడ్డిని భీమవరానికి చెందిన వ్యాపారవేత్త కుమారిడికిచ్చి వివాహం చేశారు. రేవంత్‌రెడ్డి స్థిరాస్తి వ్యాపారంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Revanth Reddy Political Career : రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏబీవీపీలో ప్రారంభమైంది. 1992 నుంచి చురుకైన కార్యకర్తగా పనిచేసేవారు. 2002లో టీఆర్ఎస్​లో చేరి కొంతకాలమే ఆ పార్టీలో కొనసాగారు. జడ్పీటీసీగా పోటీచేసి, తొలిసారి 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ మండలంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా రేవంత్‌రెడ్డి గెలుపొంది, ఆరంభంలోనే సత్తాచాటారు.

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించి, రాజకీయ పార్టీల దృష్టిని తనవైపు తిప్పుకోగలిగారు. 2008లో టీడీపీలో చేరిన రేవంత్‌రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి బరిలో దిగి రాజకీయ కురువృద్ధుడు గుర్నాథ్‌రెడ్డిని ఓడించారు. అప్పట్లో రేవంత్‌ గెలుపు చర్చనీయాంశమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికల్లో 14వేల 614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ సమయంలోనే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శాసనసభాపక్ష నేతగా ఉండి అసెంబ్లీలో అప్పటి అధికార బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా పోరాడారు.

ప్రమాణస్వీకారం చేయలేదని అధికార కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్‌

రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి. 2017లో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన నాయకత్వపటిమ, వాక్చాతుర్యం, జనాదరణ గుర్తించిన ఆ పార్టీ.. రాష్ట్రకార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే 2019మే నెలలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

Revanth Reddy Political Profile : ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండసార్లు పరాజయం, స్థానికసంస్థల్లో వైఫల్యాలు, నాయకత్వలేమి, వరుస పరాభావాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో 2021 జూన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలను రేవంత్‌రెడ్డి చేపట్టారు. సీనియర్లు వ్యతిరేకిస్తున్నా అధిష్ఠానం మాత్రం ఆయనకే పగ్గాలిచ్చేందుకు మొగ్గుచూపింది.

కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఈమెకే తొలి ఉద్యోగం - రేవంత్​ రెడ్డి అభయహస్తం

నాటి నుంచి ఎంతోమంది పార్టీని వీడినా వైఫల్యాలు వెంటాడుతున్నా, నాయకులు సహకరించుకున్నా అధికార బీఆర్​ఎస్​కు ఎదురొడ్డి పోరాడారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌లో చేరిన కొద్దికాలంలోనే అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీల అభిమానాన్ని రేవంత్‌ చూరగొన్నారు. తెలంగాణలో 21 రోజులపాటు సాగిన రాహుల్‌ గాంధీ జోడోయాత్రను విజయవంతం చేయడం ఆయన రాజకీయంగా ఎదగడంలో దోహదం చేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా వద్ద ప్రారంభమైన పాదయాత్ర నిజామాబాద్‌ జిల్లా మద్నూర్‌లో ముగిసేవరకు విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.

ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ఏర్పాట్లలో అధికారులు

శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చటంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం. రాష్ట్రవ్యాప్తంగా 80కి పైగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొని, విస్తృత ప్రచారం చేశారు. ప్రచార సభల్లో రేవంత్‌ ప్రసంగాలు జనాన్ని ఊర్రూతలూగించాయి. అధిష్ఠానం ఆదేశాలతో పార్టీ నేతలందరిని కలుపుకెళ్తూ బీఆర్ఎస్​ను గద్దె దించి, పూర్తి ఆధిక్యతతో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పాటులో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిర్వర్తించిన బాధ్యత కాంగ్రెస్‌ చరిత్రలో నిలిచిపోతుందనటంలో సందేహంలేదు.

ఉత్కంఠ వీడింది, ఊహించిందే జరిగింది - రేవంత్‌ రెడ్డికే ముఖ్యమంత్రి పగ్గాలు

మరికొద్ది గంటల్లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం- అందరూ ఆహ్వానితులే

Last Updated : Dec 7, 2023, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.