ETV Bharat / state

Telangana Budget Sessions 2023-24 : పలు బిల్లులకు శాసనసభ ఆమోదం

author img

By

Published : Feb 11, 2023, 2:01 PM IST

Bills Passed in Telangana Assembly Today : వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గురుకుల కళాశాలల్లో వ్యవసాయ కోర్సులు ప్రవేశపెడితే... ఆ కాలేజీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అందు కోసమే తాజా సవరణ చేపట్టిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Telangana Assembly
Telangana Assembly

Bills Passed in Telangana Assembly Today : రాష్ట్ర బడ్జెట్ 2023-24 సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ఇవాళ పలు బిల్లులకు ఆమోదం లభించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గురుకుల కళాశాలల్లో వ్యవసాయ కోర్సులు ప్రవేశపెడితే... ఆ కాలేజీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని..అందు కోసమే తాజా సవరణ చేపట్టిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Telangana Budget Sessions 2023-24 : అనంతరం పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. భద్రాచలాన్ని మూడు గ్రామాలు చేస్తూ సవరణ ప్రవేశపెట్టారు. నిబంధనల ప్రకారం భద్రచలాన్ని పురపాలక సంఘంగా మార్చే అవకాశం లేదని... అదే సమయంలో లక్ష వరకు జనాభా ఉంది కాబట్టి... ఒకే పంచాయతీగా ఉంచే అవకాశం లేదని... మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. భద్రాచలం గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని... పరిపాల సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలు చేసినట్లు ఎర్రబెల్లి స్పష్టంచేశారు.

KTR on Hyderabad Metro : ఇవాళ్టి సభ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ నాలాల అభివృద్ధి, మెట్రో గురించి శాసనసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నగరంలో మెట్రో రైల్‌ కొత్త పనులకు కేంద్రం మోకాలడ్డుతోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

KTR in Telangana Budget Sessions 2023-24 : దేశంలోని చిన్న చిన్న నగరాలకు కూడా మెట్రో రైళ్ల అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరు చేస్తూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహా నగరానికి మాత్రం కేంద్రం మొండి చేయి చూపుతోందని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ మెట్రో టికెట్‌ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచితే ఊరుకోమని.. ఇప్పటికే వారిని హెచ్చరించినట్లు తెలిపారు. ఆర్టీసీతో సమానంగా ధరలు ఉండాలని మెట్రో అధికారులకు సూచించామన్నారు.

Talasani on Telangana Fisheries : మరోవైపు మత్స్య శాఖపై శాసనసభ సభ్యుల ప్రశ్నలకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానాలిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపల ఉత్పత్తి పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. 2021-22లో 4.4లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా.... 3.89 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించినట్టు వివరించారు.

2022-23లో 4.67 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ధారించినట్టు పేర్కొన్నారు. చేపలు పట్టేందుకు మత్స్యకార కులస్తులకే హక్కు కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. చెరువుల్లో చేపలు పట్టడానికి ఇతర వర్గాలకు హక్కులేదని స్పష్టం చేశారు. మత్స్యకారుల కోసమే ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చినట్టు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.