ETV Bharat / state

పోలింగ్‌కు మరో 19 రోజులే గడువు - పోటాపోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 10:07 AM IST

Telangana Assembly Election Campaign 2023 : ఎన్నికల పోలింగ్‌కు మరో 19 రోజులే గడువు ఉండడంతో.. నేతలందరూ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పోటాపోటీగా ప్రజల్లోకెళ్తున్న పార్టీలు అధికారం అప్పగిస్తే.. చేపట్టే అభివృద్ధి, సంక్షేమంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు.

Telangana Assembly Elections 2023
Election Campaign in Telangana

ఎన్నికల పోలింగ్‌కు మరో 19 రోజులే గడువు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తున్న పార్టీలు

Telangana Assembly Election Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికల పర్వానికి మరో 19 రోజులే గడువు ఉండడంతో అన్ని పార్టీల నేతలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదారాబాద్‌ శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు.

ములుగు జిల్లాపై గులాబీ జెండా ఎగరేసి ముఖ్యమంత్రికి కానుకనిద్దామని.. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బాల్క సుమన్.. అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. 15 రాష్ట్రాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేసిన వివేక్ వెంకటస్వామి చెన్నూరులో మాత్రం ఎందుకు ఏర్పాటుచేయలేదని పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్ నేత ప్రశ్నించారు.

మేం అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు : రేవంత్ రెడ్డి

BRS Campaign in Telangana Assembly Election 2023 : నిర్మల్‌లో ముస్లిం ప్రార్థనా మందిరాల వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. బాన్సువాడ మండలం బోర్లంలో ప్రచారానికి వెళ్లిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి మహిళలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని డిచ్‌పల్లిలో బాజిరెడ్డి గోవర్ధన్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని కోరారు. నేను పక్కా లోకల్‌..నాన్‌ లోకల్‌ వాళ్లను నమ్ముకుంటే నట్టేట ముంచుతారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సూచించారు. ఖమ్మం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Congress Election Campaign in Telangana : అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేలా కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో జోరుపెంచారు.పాతబస్తీ చార్మినార్ నియోజకవర్గం అభ్యర్థి మొహమ్మద్ ముజిబుల్లా షరీఫ్.. పాతబస్తీ అభివృద్ధి చెందకపోవడానికి ఎంఎంఐ పార్టీనే కారణమంటూ విమర్శించారు. మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని కాంగ్రెస్ చెన్నూర్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రచారంలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్‌లో నారాయణ రావు పటేల్ ప్రచారం చేశారు. నేను ఎవరికి అమ్ముడు పోలేదని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్‌ రెడ్డి ప్రసిద్ధ సిద్దలగుట్ట నవనాథ సిద్దేశ్వరుడిపై ప్రమాణం చేశారు.

గెలుపు బాటలో అభ్యర్థుల హోరాహోరీ-పాదయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఓట్ల వేట

అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ రావాలని కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ అభ్యర్థి వొడితల ప్రణవ్‌ పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గం మంగపేటలో ఎమ్మెల్యే సీతక్క ప్రచారం చేశారు. ఇందిరమ్మ పాలన వచ్చేందుకు అందరూ కృషి చేయాలని వరంగల్ జిల్లా నర్సంపేట అభ్యర్థి దొంతి మాధవరెడ్డి కోరారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అభ్యర్థి రాగమయి పలు గ్రామాల్లో పర్యటించారు. పాలేరులో చెల్లని రూపాయి.. ఖమ్మంలో చెల్లుతుందా అంటూ పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై తుమ్మల కౌంటర్‌ ఇచ్చారు. ఖమ్మం రోటరీనగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.

BJP Election Campaign in Telangana : నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా.. బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రూ.5 లక్షల కొట్ల అప్పుల్లో ఉందని.. బీఆర్ఎస్ అవినీతి దిల్లీకి చేరిందని హన్మకొండలో కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్ ఠాగూర్ ఆరోపించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. జనగామ అభ్యర్థి ఆరుట్ల దశమంత రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అభ్యర్థులపై విమర్శలు సంధించారు.

BJP Election Campaign Josh in Telangana : మల్కాజిగిరి ప్రజలు మైనంపల్లి హనుమంతరావును తరిమి కొడితే మెదక్ వచ్చిపడ్డారని బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్ మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన, కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు తప్ప ఎవరికి రాలేదని బండి సంజయ్‌ విమర్శించారు. మూతపడ్డ చక్కెర కర్మగారాన్ని తెరిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి చేతులుదులుపుకున్నారని అలాంటి వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని.. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన భారీ రోడ్‌ షోలోనూ ఆయన పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమదేవికి మద్దతుగా బండిసంజయ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు.

తెలంగాణలో బీఆర్ఎస్​ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా - ఉప ఎన్నిక రావడం ఖాయం : బండి సంజయ్

ఓట్ల కోసం తప్పని పాట్లు - పూరీలు వేస్తూ, బట్టలు ఇస్త్రీ చేస్తూ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.