తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా - ఉప ఎన్నిక రావడం ఖాయం : బండి సంజయ్
Bandi Sanjay Comments on Govt Formation : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా..రాష్ట్రంలో ఉపఎన్నికలు రావడం ఖాయమని.. బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో.. బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమదేవికి మద్దతుగా తీసిన రోడ్‌షోలో బండి సంజయ్ పాల్గొన్నారు.
BJP Election Campaign in Sircilla : కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే బీఆర్ఎస్లో చీలిక ఏర్పడుతుందని, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్‌లో విబేధాలు వస్తాయని బండి వెల్లడించారు. పార్టీలలో అంతర్గత కొట్లాటలు వచ్చి ఉపఎన్నికలు ఖాయమన్నారు. రాష్ట్రంలో బీజేపీ సుస్థిరపాలన ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉందన్నారు. కమలం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తోందని.. రాష్ట్ర జనాభాలో సగం భాగం ఉన్న బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామంటే ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో 50 లక్షల నిరుద్యోగుల బతుకులు ఆగమయ్యయని దుయ్యబట్టారు. నేడు రాష్ట్రం అప్పులకుప్పగా మారందని.. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఒకటో తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదన్నారు.